-మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపండి.
-స్పా సెంటర్లపై నమోదైన కేసులపై సత్వర చర్యలు చేపట్టండి.
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పా సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఇప్పటివరకు నమోదైన కేసులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సంభందిత అధికారులను ఆదేశించారు.
నగరంలోని స్పా సంస్కృతిని నివారించడం లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పోలీస్, టాస్క్ ఫోర్స్ , విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ , ఐసీడీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో స్పా సంస్కృతి పేరుతో జరుగుతున్నా అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అలసత్వం వహిస్తే ముంబై , కలకత్తా వంటి నగరాల వలే స్పా సంస్కృతి పెరిగే అవకాశం ఉందన్నారు. 1956 ఐటిపీ యాక్ట్ సెక్షన్ 18,19 ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ , టాస్క్ ఫోర్స్ , లేబర్ డిపార్ట్మెంట్లు టీములుగా ఏర్పడి కేసులు నమోదు చేయడం తో పాటు 15 రోజులకొకసారి సమీక్షాసమావేశం నిర్వహించాలన్నారు. మసాజ్ సెంటర్లపై నమోదు చేసిన కేసులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 30 నుండి 40 వరకు మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని వాటిలో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం పట్ల జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలను మాయ మాటలతో మభ్యపెట్టి స్పా సంస్కృతి ద్వారా అసాంఘిక కార్యక్రమాలలోకి తీసుకొస్తున్నట్లు స్పష్టమైందన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న 10 సెంటర్లపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వారిపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఇటువంటప్పుడు అసాంఘిక కార్యక్రమాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇటువంటి సెంటర్లకు అద్దెకిచ్చే భవనాలా యజమానులపై కేసులను నమోదు చేసి భవనాలను సీజ్ చేయాలన్నారు . ఇటువంటి విష సంస్కృతి వలన సమాజానికి అన్యాయం జరుగుతుందని దీనిని నివారించడానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సెంటర్లో పట్టుబడిన మహిళలను మహిళా హోమ్ లకు తరలించి ఆశ్రయం కల్పించి మంచి మార్గంలో నడుచుకునే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించి అవగాహన కల్పించాలన్నారు.
ఇటీవల నగర పరిధిలో సెక్షన్ 18 కింద కేసులను నమోదు చేస్తూ ఫీట్ అండ్ సోల్ల్యూషన్స్ మసాజ్ సెంటర్, ఎస్ ఆర్ పేట , దియా బి అండ్ ఎస్ మాచవరం , గోల్డెన్ ఓక్స్ గాయత్రినగర్ , నోవా వెల్నెస్ గాయత్రినగర్, సిగ్ నేచర్ స్పా సిద్ధార్ధ నగర్ , హనీ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ ఆటో నగర్, బ్యూటీ స్టూడియో, ఫ్యామిలీ సెలూన్ పటమట, యు షైన్ బ్యూటీ స్పా టిక్కల్ రోడ్, ఫర్ యూ ఫ్యామిలీ సెలూన్ రామవరప్పాడు, తదితర సెంటర్లపై కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు.
సమావేశంలో ఎసిపి కమీషనర్ టాస్క్ ఫోర్స్ జివి. రమణమూర్తి, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ సి. రాయ్,ఐసీడీస్ పిడి జి. ఉమాదేవి, డా.రత్నావళి, దిశ పోలీస్ ఇన్స్పెక్టర్ కె. వాసవి, తహశీల్ధార్ బి.హేమకుమారి, పోలీస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ఎన్. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News