విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సలహాదారుడుగా కాకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడని ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కే కేశినేని శివనాద్( చిన్ని) కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియని ఒక వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుడుగా ఎలా నియమించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి మీది కాదన్నారు. ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్న పనికి లోపాలను సరిచేసి ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వ సలహాదారుడు పదవిని వైయస్ఆర్సీపీ కార్యకర్తగా మార్చేసిన నువ్వు నవ్యాంధ్ర నిర్మాతగా ఉపాధి సృష్టికర్తగా పనిచేస్తున్న పని చేసిన చంద్రబాబు నాయుడుని విమర్శించడం తగదన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకోని ఈ ప్రభుత్వ సలహాదారుడు ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఆయన పనిని మర్చిపోయాడన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వ నాశనం అయిందని అభివృద్ధి లేదని ఉపాధి లేదని ప్రజలందరికీ అర్థమయిపోయిందని ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి మేలు చేసిన వాడివి అవుతావని అది వదిలేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తగా మాటలు మాట్లాడుతూ నీ ప్రభుత్వ పరువు ని తీస్తున్నామని ఆయన విమర్శించారు. విజయవాడ అర్బన్ మైనారిటీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ మైనారిటీలను మోసగించిన దొంగ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అని అది మరిచిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చి మాటలు మాట్లాడటం సిగ్గుమాలిన చర్యని ఆయన అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్న మైనారిటీలకు రక్షణ లేకుండా పోతున్న ప్రభుత్వ సలహాదారుడిగా పట్టించుకోని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని విమర్శిస్తూ జగన్ దగ్గర మార్కులు కొట్టేసే పనిలో ఉన్నాడని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ పార్లమెంటు ఉపాధ్యక్షులు దోమ కొండ రవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News