
-ప్రత్యేక ప్రతిభావంతుల పట్ల ప్రేమ చూపాలి
-పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీఎన్ఐ సభ్యులు
-విజయవాడకు రావడం ఆనందంగా ఉంది:- బాలీవుడ్ నటీమణి చిత్రాలిదాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని బీఆర్టీయస్ రోడ్డులోని శారదా కళాశాల సమీపం నుంచి శనివారం ఉదయం నిర్వహించిన 5కె వాక్ రన్ ఆద్యాంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటి చిత్రాలిదాస్ మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేయడంలో బీఎన్ఐ సభ్యులు ముందుంటారని వారి సమాజ స్ఫూర్తే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని తెలిపారు. కేవలం ప్రత్యేక ప్రతిభావంతులకు అండగా ఉండాలని వారికి భరోసా కల్పించేందుకు 5కె వాక్ రన్ నిర్వహించడం అభినందనీయం అని పేర్కొంటూ నిర్వాహకులను ప్రశంసించారు. నడక అనేది మనిషికి ఆరోగ్యాన్ని పెంచుతుందని, తద్వారా ఆనందాన్ని, వెల్త్‌ను సంపాదించుకోవడం ఎంతో సులువని పేర్కొన్నారు. బీఎన్ఐ అంటే వ్యాపార సంస్థ కాదని తాను సంపాదించిన దానిలో సామాజిక బాధ్యతగా సమాజం కోసం తమ వంతు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్‌లు మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రతిభావంతుల పట్ల ప్రతిఒక్కరూ జాతి కాకుండా ప్రేమ చూపాలని కోరారు. సమాజంలో వారు కూడా భాగస్వాములేనని అటువంటి వారి పట్ల అందరూ అండగా నిలవాలని కాంక్షిస్తూ 5కె వాక్ రన్ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేశారు. వ్యాపారుల పరస్పర సహకార, అభివృద్ధి వేదికగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ద్వారా మంచి మార్పు కనిపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీఎన్ఐ సభ్యులు కుటుంబసమేతంగా హాజరై 5కె వాక్ రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా బీఎన్ఐ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ నటి చిత్రాలిదాస్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవడం పట్ల చిత్రాలిదాస్‌ను బీఎన్ఐ సభ్యులు అభినందించారు. చిత్రాలిదాస్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. 5కె రన్ కార్యక్రమానికి యాపిల్ మెడి ల్యాబ్స్ అధినేత డాక్టర్ చిలకపాటి రామ్‌చంద్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో బీఎన్ఐ సభ్యులు రాళ్ళపల్లి శ్రీనివాస్, సురేన్, ప్రశాంత్ దాస్, విద్యాసాగర్, సుబ్బు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News