Breaking News

చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ఆథరైజ్డ్‌ షోరూం ఆవిష్కరణ


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బజాజ్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రంగంలో ప్రముఖ తయారీ సంస్థ బజాజ్‌ ఆటో విజయవాడలో మొట్టమొదటి చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ఆథరైజ్డ్‌ షోరూంని సోమవారం విజయవాడ, ఎం.జి.రోడ్‌ నందు ఎం.పూరేంద్ర, డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమీషనర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.వి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, వరుణ్‌ బజాజ్‌ వారు మాట్లాడుతూ నానాటికి పెరుగుతున్న పెట్రోల్‌ ధరల కారణంగా ఎక్కువమంది నేడు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు దృష్టి మళ్ళిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా గోపాల శ్రీవాస్తవ్‌, జడ్‌ఎం బజాజ్‌ వారు మాట్లాడుతూ తక్కువ మెయింటనెన్స్‌, కాలుష్యరహితమైన చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అన్ని వయసుల వారికీ అనువుగా వుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేతక్‌ మరియు వరుణ్‌ బజాజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *