గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి సంబరాల విజయవంతం లో అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులతో పాటు నగర ప్రజల సహకారం కూడా మరువలేనిది అని నగర్ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు విజయవంతం అయ్యాయని, సంబరాల్లో భాగస్వాములైన ఈవెంట్ ఆర్గనైజర్ కాసుల కృష్ణంరాజు, కళాకారులు, అధికారులు, లైటింగ్, మైక్ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, ఎన్టీఆర్ స్టేడియం సిబ్బందిని ఆదివారం సంబరాలు ముగిసిన వెంటనే ప్రత్యేకంగా అభినందించిన మేయర్ కావటి మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం. సంబరాల నిర్వహణకు సహకరించిన స్పాన్సర్స్ కు నగరపాలక సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News