Breaking News

జిల్లాలో ఉపాధి హామీ ద్వారా ఇప్పటివరకు కూలీలకు 67 లక్షల 30 వేల పనిదినాలు కల్పించాం.

-మార్చ్ మాసాంతరానికి 77 లక్షల పనిదినాలు కల్పించేందుకు చర్యలు.
-చెత్తనుండి సంపత తయారీ కేంద్రాలను సమర్ధవంతంగా (ఎస్ డబ్ల్యు పిసి) నిర్వహించేందుకు చర్యలు.
-డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె. సునీత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామీ పధకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 64 లక్షల 30 వేల పనిదినాలను కల్పించడం జరిగిందని 77 లక్షల పనిదినాలు కల్పించాలన్న లక్ష్యాన్ని మార్చ్ మాసాంతరానికి సాధిస్తామని చెత్తనుండి సంపత తయారీ కేంద్రాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె. సునీత అన్నారు.
కంచికచర్ల మండలం కొత్తపేటలో ఉపాధిహామీ పనులను చెత్తనుండి సంపత తయారీ కేంద్రాన్ని శనివారం డ్వామా పీడీ జె. సునీత పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పని కోరిన ప్రతి కూలీకి ఉపాధిహామీ పథకం ద్వారా పనులు కల్పిస్తున్నామన్నారు. అమృత సరోవర్ పథకం ద్వారా 36 చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ లు, పంటకాలువలు, పంటబోదులు, డొంకరోడ్లు అభివృద్ధి చేయడం, కందకాలు తవ్వడం వంటి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఉపాధిహామీ కూలీలకు వారు చేసిన పనుల ఆధారంగా రోజుకు సగటున 242 రూపాయలు వేతనం లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కూలీలకు ఎప్పటికప్పుడు వేతనాలను చెల్లిస్తున్నామన్నారు. గ్రామాలలో నిర్వహిస్తున్న చెత్తనుండి సంపద తయారీ కేంద్రం( ఎస్ డబ్ల్యు పిసి) లను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్ డబ్ల్యు పిసి ల ద్వారా తయారైన వర్మీ కంపోస్ట్ ను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించి రైతులను చైతన్య వంతులను చేసి వర్మీ కంపోస్ట్ ను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పంటలకు, మొక్కల పెంపకానికి వర్మీ కంపోస్టు ను వినియోగిస్తున్నామన్నారు. ఇళ్ల నుండి చెత్తను సేకరించే సమయంలో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని పారిశుధ్య కార్మికులను ఆదేశించామన్నారు. జిల్లాలో 288 గ్రామ పంచాయతీలలో 265 ఎస్ డబ్ల్యు పిసి షెడ్ ల నిర్మాణాలను పూర్తి చేసి సమర్ధవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని మరో 23 షెడ్ల నిర్మాణం పూర్తిచేయవలసి ఉందని ఇందులో 12 బేస్మెంట్ లెవెల్ 4 పిల్లర్ లెవెల్ లో ఉన్నాయని మరో 7 షెడ్ల నిర్మాణ పనులు ప్రారంభించవలసి ఉందని తెలిపారు. షెడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సునీత తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-ప్రజలు అత్యవసర సమాచారం కోసం 08672-252399 నంబర్‌కు ఫోన్ చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *