Breaking News

వ్యర్ధాల సేకరణకు ఈ-ఆటోలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో గుంటూరు నగరంలో ఇంటింటి నుండి వ్యర్ధాల సేకరణకు ఈ-ఆటోలు అందుబాటులోకి రానున్నాయని, ఆటోల నిర్వహణకు కార్మికులకు తగిన శిక్షణ ఇస్తున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం ఇన్నర్ రింగ్ రోడ్ లో ఈ-ఆటోల శిక్షణ పూర్తి చేసుకున్న కార్మికులు చేపట్టిన ట్రయల్ రన్ ను కమిషనర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్)లో భాగంగా గుంటూరు నగరానికి 220 ఈ-ఆటోలను అందించిందని, వాటిని నడిపేందుకు కార్మికులకు గత నెల రోజుల నుండి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలో ఆటోలు అందుబాటులోకి తీసుకురానున్నందున కార్మికులకు త్వరగా ఆటోల నిర్వహణ, నడపడం పై పట్టు వచ్చేలా చూడాలని ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శిక్షణ అనంతరం కార్మికులకు ట్రాఫిక్ తక్కువగా ఉన్న ప్రధాన రహదార్ల మీద కూడా శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణలో ఆటో నడపడంతో పాటు ఛార్జింగ్ పెట్టడం, సాదారణ నిర్వహణ అంశాల పై కూడా అవగాహన కల్గించాలని తెలిపారు. ఈ- ఆటోలు అందుబాటులోకి వస్తే నగరంలో సమగ్రంగా పారిశుధ్య పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయడానికి అవకాశం కల్గుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్.ఈ. భాస్కర్, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ కొండారెడ్డి, డి.ఈ.ఈ. హనీఫ్, ఎస్.ఎస్.లు రాంబాబు, ఆనందకుమార్, సోమ శేఖర్, ఆయుబ్ ఖాన్, ఏ.ఈ. దుర్గా ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *