Breaking News

ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం : హోం మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో ఏ ముఖ్యమంత్రి అందించలేనంత సంక్షేమం రాష్ట్రంలో ఈ రోజున వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అందించారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని, చంద్రబాబు నాయుడు హామీని నిలబెట్టుకోకపోవడంతో డ్వాక్రా గ్రూపులు నిర్వీర్యమై ఏ గ్రేడ్ నుండి బి, సి గ్రేడ్ లోకి పడిపోయాయని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పర్యటనలో భాగంగా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో పొదుపు సంఘాల మహిళలతో హోం మంత్రి సమావేశం నిర్వహించారు. అనంతరం అన్నదేవరపేటలో మూడో రోజు పర్యటన ఓల్డ్ బీసీ కాలనీ, యానాది కాలనీ, బూడిదగుంట ప్రాంతాలలో, ఆదివారం ఆమె పర్యటించారు. ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామంలోని వైయస్సార్ సెంటర్ లోని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అర్హత ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి కనీసం ఐదు లక్షల నుండి పది లక్షల వరకు లబ్ధి చేకూరిందని తెలిపారు. మన ప్రభుత్వంలో అందించే సంక్షేమం అంతా ఉచితం అని, ఎవరు తిరిగి కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఉచిత పథకాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నామన్న ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఖండించారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా పేదల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారని చెప్పడానికి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలే నిదర్శనమన్నారు. 2014 ఎన్నికల సమయంలో మన రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయింది గనుక ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయితే అనుభవం లేదని ప్రచారం ప్రజల్లోకి  తీసుకెళ్లారని, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గత ఐదెళ్ల పాలనలో ప్రజలకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ బడ్జెట్ దాదాపు సమానంగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం రూపొందించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు హోంమంత్రి వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *