Breaking News

రాష్ట్రానికి ఎల్లో వైరస్ అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం చంద్రబాబు పవన్ కలయిక అపవిత్రం… : డిప్యూటీ సీఎం కొట్టు 

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి ఎల్లో వైరస్ సో కబోతోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే నష్టపోతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. చంద్రబాబు పవన్ కలయిక అపవిత్రమని పేర్కొన్నారు. చంద్రబాబును వదిలితేనే జనసేనకి భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ కు ఎదుగుదల ఉంటుందని సూచించారు. లేనిపక్షంలో అభిమానులకు కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేసిన వాడిగా చరిత్రలో మిగిలిపోతాడని అన్నారు. అందరూ కలిసి పోటీ చేసిన విడివిడిగా పోటీ చేసిన రాబోయే ఎన్నికల్లో గెలిచేది మాత్రం వైకాపాయేనని మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని డిప్యూటీ సీఎం కొట్టు ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లోనే ప్రజలు బుద్ధి చెప్పారని అయినా చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కాలేదన్నారు. 2024 ఎన్నికలు ఆ పార్టీకి చివరి ఎన్నికలని తర్వాత తెలుగుదేశం అంతర్దానమైపోవడం ఖాయమని మంత్రి కొట్టు అన్నారు. ఏదోలాగా తెలుగుదేశం మళ్లీ బ్రతికించుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో పొత్తుకు తహతహలాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పచ్చ మీడియా కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. వైకాపా ప్రభుత్వంలో జగనన్న సంక్షేమ పాలనలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీలు ప్రజల మనసులను ఆలోచనలను కలుషితం చేసే విధంగా రకరకాల దుష్ప్రచారాలు సాగిస్తున్నాయని విమర్శించారు. వచ్చేది ఎన్నికల ఏడాది కాబట్టి రాష్ట్రమంతా ఎల్లో వైరస్ లా సోకి ప్రజల కు అందుతున్న సంక్షేమ పథకాలను రద్దుచేసి ప్రజలను మళ్ళీ కష్టాల్లోకి నెట్టాలని పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలంతా అప్రమత్తంగా దీనిని ఎదుర్కోవాలని సంక్షేమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని మంత్రి కొట్టు పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది వారి పిచ్చి వికృత రూపం దాలుస్తోందన్నారు రాజకీయ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు మేలు చేయాలని సానుకూల దృక్పథంలో వైకాపా ఉండగా ఎలాగైనా దాన్ని చెడగొట్టాలని వ్యతిరేక దృక్పథంతో తెలుగుదేశం జనసేన ఉన్నాయన్నారు. 2009లో ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనను చూసి ఓటు వేయాలని పాజిటివ్ దృక్పథంతో ఎన్నికలకు వెళ్లి గెలిచారన్నారు. నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతో సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. కానీ 14 ఏళ్ళు పాలించిన తెలుగు దేశానికి చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజలను గందరగోళానికి గురిచేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలో ఉందన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేసుకోవాల్సింది మహానాడు కాదని విద్రోహదినంగా పాటించాలన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ప్రజా వ్యతిరేక పథకం ఒకటైన ఉందని చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రజలు ముందుకు వచ్చి ఫలానా పథకం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని చెబితే ప్రజలే తిరిగి తెలుగుదేశానికి తగిన గుణపాఠం చెబుతారని మంత్రి కొట్టు హెచ్చరించారు. చంద్రబాబుతో జతకడుతూ పవన్ కళ్యాణ్ రోజు రోజుకి రాజకీయంగా పతనమైపోతున్నాడన్నారు. కాపు సామాజిక వర్గాన్ని కరివేపాకుల వాడుకుని వదిలేసే చంద్రబాబుతో పవన్ ఎందుకు జతకట్టాలని ప్రశ్నించారు. కొన ఊపిరితో ఉన్న టిడిపి తో కలవడం ద్వారా జనసేన రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుందన్నారు. తనను అభిమానించే లక్షలాది మంది అభిమానులను కాదని తనకు అండగా నిలబడాలనుకునే కాపు సామాజిక వర్గం మనోభావాలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీతో చంద్రబాబుతో అంట కాకడానికి పవన్ కు అధికారం ఎవరిచ్చారు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ అపవిత్ర కలయికతో సామాజిక వర్గం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు రాజకీయాల్లో ఉనికి కోసం పోరాడాలి తప్ప మరొకరు వైపు ఒరిగిపోకూడదని అలా చేస్తే ఎప్పటికీ ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా వ్యక్తిగతంగా ఎదగలేరని సూచించారు. కాపు సామాజిక వర్గానికి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశారన్నారు. ఐదు మంత్రి పదవులు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో హీరోగా కింగ్ గా కింగ్ మేకర్ గా రాణించాలంటే చంద్రబాబును వదిలేయాలని సూచించారు. ఏది ఏమైనా ఎవరు కలిసిన ఎవరు విడిపోయిన చివరకు గెలిచేది మాత్రం వైకాపాయేనని మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఉద్ఘాటించారు. ఈ విలేకరుల సమావేశంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కొలుకులూరి ధర్మరాజు వైకాపా నాయకులు కొట్టు విశాల్ బొద్దాని శ్రీనివాస్ ఆకుల ధనశేఖర్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *