విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమభావనా మిత్రమండలి విజయవాడ సంస్థ వారి 88వ సమావేశం బెంజ్ సర్కిల్ సందుగల నాస్తిక కేంద్రంలో ఆదివారం జరిగింది. టి.సోభనాద్రి సంస్థ అధ్యక్షులు సభాధ్యక్షత వహించారు. ఇందులో కీర్తిశేషులు చెన్నుపాటి శేషగిరి రావు, చెన్నుపాటి విద్య గార్ల ధార్మికోపన్యాసం జరిగింది. ఈ కార్యక్రమానికి నికి ముఖ్య అతిధిగా ప్రముఖ వైద్యులు జి.సమరం, చైర్మెమ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యన్.టి.ఆర్ జిల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నుపాటి శేషగిరిరావు స్పూర్తి ప్రధాన కర్త అని గొప్ప మంచి మనస్సు ఉన్న వ్యక్తిత్వం గల వారు అని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ, భగత్ సింగ్ గార్ల ను స్ఫూర్తిగా తీసుకున్నారని జాతీయ భావం సమాజ సమభావం మిళితమే శేషగిరి రావు అని అన్నారు. చదువు యొక్క విలువలు తెలుసుకుని మగవారితో సమానంగా మహిళలూ ఉన్నత విద్యను అభ్యసించాలని అంకాంక్షించారన్నారు. చెన్నుపాటి విద్య సమాజ సేవ చేయడానికి వెన్నుతట్టి ప్రోత్సహించిన వారిలో ప్రధమంగా శేషగిరిరావు ఉన్నారని తెలిపారు. అందరూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో మహాత్మా గాంధీ ఆరోగ్య సదన్ అనే సంఘాన్ని స్థాపించి యువతను వ్యాయామం వైపు మరల్చారని ఆయన అన్నారు.
అనంతరం డాక్టర్ జి.సాంబశివ రావు సంస్థ ఉపాధ్యక్షులు చెన్నుపాటి విధ్య గురించి మాట్లాడుతూ ఆలోచనలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజ సేవ చేయగలం అని ఆమె ఆచరించి చూపించారని ఆయన అన్నారు. సామాజిక సేవా దృక్పదంతో కొండు సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా విజయవాడ ప్రజలకు ఎన్నో సేవలను అందించారని, వెనుకబడిన తరగతుల వారి జీవితాలలో ఏసు మార్పులను తెచ్చారని, వీధిబాలలకు ఒకేషనల్ ట్రైనింగ్ లు ఇచ్చి వారి కాళ్ళమీద వారు నిలబడేందుకు ఎంతగానో కృషి చేశారని ఆయన అన్నారు. విజయవాడ మాత విద్యమ్మ గా ఆయన అభివర్ణించారు.
అనంతరం విశిష్ట అతిధి డాక్టర్ సుష్మా గుమ్మా హోలిస్టిక్ స్యూట్రషన్ గురించి చిన్ననాటి నుండి వృద్యాప్యం వరకు ఎలాంటి ఆహారం, వ్యాయామం తీసుకోవాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సమభావన మిత్రమండలి కార్యదర్శి కోనేరు నరేంద్రబాబు, యార్లగడ్డ రంగా రావు, డాక్టర్ దీక్ష, డాక్టర్ జంధ్యాల శంకర్, జి. రశ్మి సమరం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News