విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కార్పోరేటర్ల బృందం 15 రోజుల ఈశన్య రాష్ట్రాల విజ్ఞాన యాత్ర లో భాగంగా హైదరాబాద్ కు బయలుదేరిన బస్సు ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జెండా ఉపి కార్పొరేటర్లు మరియు అధికారులు అదనపు కమిషనర్ (జనరల్ ) శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) సత్యవతి, మేనేజర్ బి. శ్రీనివాసరావు కలసి ప్రారంభించారు. సదరు కార్పొరేటర్ల బృందంలో 29 మంది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, 8 గురు తెలుగుదేశం, 3 కో-ఆప్టేడ్ మెంబర్లతో పాటుగా స్టడీ టూర్ సమన్వయకర్తగా డా.రవి చంద్, వి.ఏ.ఎస్, అసిస్టెంట్ ఇంజనీర్ కె.యేసుపాదం మరియు ఇద్దరు సహాయక సిబ్బంది ఉన్నారు. సదరు కార్పొరేటర్ల బృందం 1వ తేదిన ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరి గౌహతి మున్సిపల్ కార్పొరేషన్, 3వ తేదిన షిలాంగ్ మున్సిపల్ కార్పొరేషన్, 6వ తేదిన జలపాయిగురి మున్సిపల్ కార్పొరేషన్, 7వ తేదిన గ్యాంగ్ టక్ మున్సిపల్ కార్పొరేషన్, 10వ తేదిన డార్జిలింగ్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు 12వ తేదిన కలకత్తా నగరపాలక సంస్థ లలో చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన మరియు వివిధ ప్రాజెక్ట్ లపై అద్యయనం చేయుదురు.
Prajavartha Online Telugu News