ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు స్వీకరించిన ఎంపీ భరత్

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ స్వీకరించారు. దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జీ20 ప్రెసిడెన్సీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు-2023 తో ఎంపీ భరత్ ను సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ, హరిత విప్లవం దిశగా ఎంపీ భరత్ రాజమండ్రిలో గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డు వరించింది. యువతా హరితా, గో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో యువతను, విద్యార్థులకు మొక్కల పెంపకంపై ఆసక్తితో పాటు ఒక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యేందుకు ఎంపీ భరత్ చేసిన, చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రశంసించింది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జీ20 ‘వసుధైక కుటుంబం’-2023 థీమ్ గా తీసుకుందని ఎంపీ భరత్ తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సెలెన్స్ అవార్డు రావడం పట్ల ఎంపీ భరత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి రాజమండ్రి నగరంలోని విద్యార్థినీ విద్యార్థులు, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు, యువత ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. వారందరికీ ఈ అవార్డు అంకితం చేస్తున్నానని ఎంపీ భరత్, మున్సిపల్ కార్పొరేషన్ ఎంతో దీక్షగా మొక్కలు నాటే కార్యక్రమంలో తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *