Breaking News

ప్రజా సమస్యల పరిష్కారానికై హెల్ప్ డెస్క్ ఏర్పాటు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపకు గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాల ద్వారా ఇప్పటికే నియోజకవర్గంలో వేలాది సమస్యలకు పరిష్కారం చూపినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఆ సమయంలో అందుబాటులో లేని ప్రజలు ఈ హెల్ప్ డెస్క్ ను సద్వినియోపరచుకోవలసిందిగా సూచించారు. కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫెకెట్లతో పాటు., ఇంటి పన్ను, వాటర్ పన్ను, యూజీడీ పన్నులలో పొరపాట్లు., చదువు పూర్తయి కాలేజీలలో సర్టిఫికెట్లు ఆగిపోయిన విద్యార్థులు., ఆరోగ్య ఆసరా డబ్బులు పడని వారు.. తదితర సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేయాలని పేర్కొన్నారు. గతంలో పరిష్కారం కాని వినతులను సైతం మరోసారి పున: పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూసద్వినియోగపరచుకోవలసిందిగా కోరారు. సమాచారం కోసం హెల్ప్ డెస్క్ నెంబర్ 7627848484 ని సంప్రదించవచ్చని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *