Breaking News

అత్య‌వ‌స‌ర చికిత్స‌కు అద‌న‌పు సౌక‌ర్యాలు

– జీజీహెచ్‌లో అందుబాటులోకి 12 ప‌డ‌క‌ల నూత‌న అత్య‌వ‌స‌ర చికిత్సా విభాగం
– ప్రైవేటుకు దీటుగా ఆసుప‌త్రిలో అత్య‌వ‌స‌ర చికిత్స సౌక‌ర్యాలు
– జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ‌లోని కొత్త ప్ర‌భుత్వ సామాన్య ఆసుప‌త్రిలో అత్య‌వ‌స‌ర చికిత్స‌కు అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పించే క్ర‌మంలో కొత్త‌గా మ‌రో 12 ప‌డ‌క‌ల అత్య‌వస‌ర చికిత్సా విభాగం (ఈఎండీ) అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. బుధ‌వారం జీజీహెచ్‌లో రాష్ట్ర ప్ర‌ణాళికాబోర్డు వైస్ ఛైర్మ‌న్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ డా. డీఎస్‌వీఎల్ న‌ర‌సింహం త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ డిల్లీరావు నూత‌న అత్య‌వ‌స‌ర చికిత్సా విభాగాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ ఇప్ప‌టికే జీజీహెచ్‌లో 16 ప‌డ‌క‌ల‌తో రోగుల‌కు అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అందించే సౌక‌ర్యం ఉంద‌ని.. ఇప్పుడు ఈ సేవ‌ల విస్త‌ర‌ణ‌లో భాగంగా మ‌రో 12 ప‌డ‌క‌ల‌తో విభాగం ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. ఆసుప‌త్రి సిబ్బంది ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఓ స‌వాల్‌గా తీసుకొని విభాగం ఏర్పాటుకు కృషిచేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు దీటుగా రోగుల‌కు అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అందించ‌వ‌చ్చ‌న్నారు. అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌తో ఏర్పాటుచేసిన ఈ కేంద్రం అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల కోసం వ‌చ్చే వారికి వ‌ర‌ప్ర‌దాయిని అని.. ఇక్క‌డ స్టెబిలైజేష‌న్ కోసం అవ‌స‌ర‌మైన నిపుణులైన వైద్య బృందం, సౌక‌ర్యాలు ఉన్న‌ట్లు తెలిపారు. గోల్డ‌న్ అవ‌ర్‌లో మెరుగైన వైద్యం అందించ‌డం ద్వారా మ‌నిషి ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చ‌ని.. ఇందుకు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. జీజీహెచ్‌లో రోజుకు దాదాపు 3000 వ‌ర‌కు అవుట్ పేషెంట్లకు సేవ‌లందిస్తున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా 1,500 వ‌రకు ఇన్‌పేషెంట్ సామ‌ర్థ్యం ఉంద‌న్నారు. స‌ర్జ‌రీల‌ను కూడా అత్యంత విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆరోగ్య‌శ్రీకి సంబంధించి సేవ‌లు అందించే విష‌యంలో విజ‌య‌వాడ జీజీహెచ్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌ని.. ఇందుకు స‌మ‌ర్థ‌వంతులైన బృందం కృషి కార‌ణ‌మ‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు.

వైద్య రంగానికి ప్ర‌భుత్వ ప్రాధాన్యం: శాస‌న‌స‌భ్యులు మ‌ల్లాది విష్ణు
రాష్ట్ర ప్ర‌భుత్వం గౌర‌వ ముఖ్య‌మంత్రి నేతృత్వంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌ని విజ‌య‌వాడ సెంట్ర‌ల్ శాస‌న‌స‌భ్యులు మ‌ల్లాది విష్ణు అన్నారు. జీజీహెచ్‌లో రోగుల‌కు అత్యంత నాణ్య‌వంతంగా వైద్య సేవ‌లు అందించే ఏర్పాట్లు ఉన్న‌ట్లు తెలిపారు. నాలుగున్న‌రేళ్లుగా రాష్ట్రంలో ఆసుప‌త్రుల అభివృద్ధికి విశేష కృషి జ‌రుగుతోంద‌న్నారు. పొరుగు జిల్లాల నుంచి కూడా విజ‌య‌వాడ‌కు వైద్య సేవ‌ల కోసం వ‌స్తున్నార‌ని.. ప్రైవేటుకు దీటుగా ఇక్క‌డ సేవలు అందుతున్నాయ‌న్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్యానికి పెద్ద‌పీట వేస్తూ గౌర‌వ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి.. విజ‌య‌వంతంగా అమ‌లుచేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇన్‌పేషెంట్‌, అవుట్ పేషెంట్‌, స‌ర్జ‌రీల విష‌యంలో జీజీహెచ్ ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. మున్ముందు కూడా ఆసుప‌త్రి అభివృద్ధికి కృషిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక్క‌డి స‌మ‌ర్థులైన సిబ్బంది ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన ఆరోగ్య సేవ‌లు అందుతున్నాయ‌ని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో సిద్ధార్థ వైద్య క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డా. కె.సుధాక‌ర్‌, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. డి.వెంక‌టేష్‌, ఈఎండీ ఇన్‌ఛార్జ్ డా. కేఏఎస్ నూరుల్లా, వివిధ విభాగాల వైద్య అధికారులు, ఆసుప‌త్రి సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *