-దేశవ్యాప్తంగా తయారైన హస్తకళ రూపాలు ఒకే వేదికపై ప్రదర్శన..
-హస్త కళలను అదరించి కళాకారులను ప్రోత్సహించండి..
-రాష్ట్ర ప్రభుత్వ ప్రన్సిపల్ సెక్రటరి కె. సునీత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సాంస్కృతి సాంప్రదాయలకు ప్రతి రూపాలైన ప్రాచీన హస్త కళలకు ప్రాచుర్యం కల్పించి ప్రజలకు చేరువ చేసేందుకు క్రాప్ట్ బజార్లను నిర్వహించడం ద్వారా హస్త కళాకారులను ప్రోత్సహించాల్సిన ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రన్సిపల్ సెక్రటరి కె. సునీత తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హస్త కళాల అభివృద్ధి సంస్థ, కేంద్ర జౌళి శాఖ డెవలప్‌మెంట్ కమీషనర్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పిన్నమనేని పాలిక్లిక్ రోడ్డులోగల సిద్దార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి హస్త కళాల ప్రదర్శన లేపాక్షి క్రాప్ట్ బజార్ `2023 ను బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రన్సిపల్ సెక్రరటరీ కె. సునీత, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ వెలంపల్లి శ్రీనివాసరావులు ప్రారంభించారు.
ప్రదర్శనను తిలకించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రన్సిపల్ సెక్రటరీ కె. సునీత మట్లాడుతూ ప్రాచీన హస్త కళలు, సాంస్కృతి సాంప్రదాయలకు భారత దేశం నిలువెత్తు నిదర్శనం అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రలకు చెందిన హస్త కళాకారులు వారి కళా నైపుణ్యంతో ప్రజలను ఆకర్షించే విధంగా అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారన్నారు. ఎంతో వ్యయ ప్రయాసలను తట్టుకుని హస్త కళల పై ఉన్న మక్కువతో కళాకారులు ఇప్పటికి కళలకు జీవం పోస్తున్నారన్నారు. అటువంటి వారిని అదరించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హస్త కళాకారులు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెంట్ సౌకర్యం కల్పించేలా క్రాప్ట్ బజార్లను నిర్వహిస్తుందన్నారు. ఈ ఏడాది క్రాప్ట్ బజార్ల నిర్వహణకు 5 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పట్టణాలలో ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. నేతనన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా తయారు అయిన హస్త కళా రూపాలను ఒకే వేదికపై తీసుకువచ్చిన క్రాప్ట్ బజార్‌ను సందర్శించి వినియోగదారులు హస్త కళాలను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులకు జీవనోపాధి కల్పించడంతో పాటు సంస్కతి సాంప్రదాయాలను భవితరాలకు అందించాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 105 స్టాల్స్ ద్వారా వినియోగదారులను ఆకర్షించేలా హస్త కళారూపాలను ప్రదర్శిస్తున్నారన్నారు. ఏటికొప్పాక బొమ్మలు, నిర్మల్ బొమ్మలు, ఎపిఉడ్‌కార్వింగ్స్ బంజారా క్రోచెట్ లేస్, హైదరాబాద్ పెరల్స్, మెటల్ కాస్టింగ్స్, బొబ్బిలి వీణల, కలంకారి పెయింటింగ్స్ జ్యూట్ బ్యాగ్స్, రోజ్ ఉడ్ కార్వింగ్స్, తంజావూర్ పెయింటింగ్స్, డైమండ్ ఫోటోస్, వులన్ కార్పెట్స్, మంగళగిరి, పోచంపల్లి వెంకటగిరి గద్వాల్ సిద్దిపేట్ నారాయణ్‌పేట్ చీరాల కలంకారి బాటిక్ ప్రింటింగ్ బెంగాలి కాటన్ కాశ్మీరి సిల్క్ కోసా సిల్క్ మధురై లక్నో చికన్ వర్క్ నారాయణవరం గాగ్రా చోళి కాటన్ ప్రింటెడ్ సంబల్ పూర్ వంటి హస్త కళా రూపాలు సందసుకులను కనువిందు చేయనున్నాయన్నారు.
శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ మాట్లాడుతూ హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. హస్త కళరూపాలకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు క్రాప్ట్ బజార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హస్త కళాకారులకు వైఎస్సార్ పేరుతో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పద్మశ్రీ అవార్డులను అందజేయడం జరిగిందన్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయనున్న అబేంద్కర్ స్మృతివనం కాంప్లెక్స్ లో రాష్ట్రానికి చెందిన హస్త కళాకారులు రూపొందించి కళారూపాలను ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించుకునేలా ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తానన్నారు.
శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ హస్త కళాకారులు అత్యంత కళ నైపుణ్యంతో తయారు చేసిన వస్తువులను సుమారు 100కు పైగా స్టాల్స్ నందు ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రానికి చెందిన వారే కాక దేశ వ్యాప్తంగా జాతీయ అవార్డులు పొందిన చేతి వృత్తి కళాకారులు వారు తయారు చేసిన ఉత్పత్తులను క్రాప్ట్ బజారులో ప్రదర్శిస్తున్నారని ఈ అవకాశాన్ని హస్త కళల అభిమానులు సద్వినియోగం చేసుకుని కళాకారులను ప్రోత్సహించాలన్నారు.
హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యం. బాలసుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ దేశంలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, రాజస్థాన్, మహారాష్ట్ర, బిహార్, ఒరిస్సా, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పేరుగాంచిన హస్త కళా ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించనునట్లు ఆయన తెలిపారు.
హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బి. విజయలక్ష్మి మాట్లాడుతూ హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన క్రాప్ట్ బజార్‌ను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. ఈనెల 9వ తేది వరకు ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సెలవు రోజులలో కూడా కొనసాగుతుందని ఆమె తెలిపారు.
క్రాప్ట్ బజార్ ప్రారంభ కార్యక్రమంలో హస్త కళల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యం. విశ్వ లేపాక్షి ఒఎస్‌డి ఐవి లక్ష్మినాద్, మేనేజర్ యం సురేష్, హ్యాండిక్రాప్ట్స్ ప్రమోషనల్ ఆఫీసర్ యం. సువర్చల, మార్కెటింగ్ మేనేజర్ శ్రీధరా చారి, హస్త కళల అభివృద్ధి లేపాక్షి సంస్థ అధికారులు సిబ్బంది వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News