Breaking News

అభివృద్ధికి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-01వ డివిజన్ 001 వ వార్డు సచివాలయ పరిధిలో తొమ్మిదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మేటిగా నిలిపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 01 వ డివిజన్ 001 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శివారు కాలనీలలో విస్తృతంగా పర్యటించి.. 102 గడపలను సందర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాలను పట్టించుకోకుండా.. పూర్తి నిర్లక్ష్యానికి గురిచేసిందని మల్లాది విష్ణు అన్నారు. ఈ పరిసర ప్రాంతాల అభివృద్ధికి కనీసం నయా పైసా కూడా వెచ్చించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈప్రాంతాలకు కొత్త కళ వచ్చిందని.. ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందించే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ చిట్టచివరి గడపకు చేరువైందని.. నగర శివారు ప్రాంత ప్రజలు సైతం ఈ వ్యవస్థను కీర్తించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

ప్రభుత్వంపై బీజేపీ గోబెల్స్ ప్రచారం
రాష్ట్రంలో బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ముఖ్యంగా పురంధేశ్వరి గారు పార్టీ పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో బీజేపీ బాబుకి బీ టీంలా మారిపోయిందని విమర్శించారు. ఇసుక గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఐదేళ్లు టీడీపీతో అధికారాన్ని పంచుకున్న బీజేపీకి ఏ మాత్రం లేదన్నారు. బాబు హయాంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా గూర్చి పచ్చ పత్రికలలోనే అనేక కథనాలు వచ్చాయని గుర్తుచేశారు. గోదావరి, కృష్ణా, పెన్నా.. ఇలా నదులతో పాటు చివరకు వాగుల్లో దొరికే ఇసుకను సైతం టీడీపీ నాయకులు వదలకుండా దోచేశారని ఆరోపించారు. ఒక్క ఇసుక ద్వారానే ఐదేళ్లలో తెలుగుదేశం నాయకుల అక్రమార్జన దాదాపు రూ.12,500 కోట్లకు చేరిందన్నారు. ఇవేమీ బీజేపీ నాయకులకు తెలియదా..? అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అక్రమాలను ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో బాధితులను పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఇసుక ట్రాక్టర్లతో తొక్కించి చంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆరోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని గుర్తుచేశారు. కనుక ఇకనైనా గోబెల్స్ ప్రచారాలను బీజేపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు కొండా మహేశ్వరరెడ్డి, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, బండి వేణు, మండాది వెంకట్రావు, పావని, అనంతలక్ష్మి, నాగరాజు, చంద్రశేఖర్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *