Breaking News

“ఆడదాం ఆంధ్ర”

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
చక్కటి ఆరోగ్యానికి శరీర దారుఢ్యం , మానసిక ఉల్లాసాన్ని,పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. క్రీడలు పట్ల ఆసక్తి ఉండి అనివార్య కారణాల వలన క్రీడలకు దూరమైన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆడదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని శనివారం కొవ్వూరు పట్టణంలో ప్రారంభించి 3కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బావన రత్నకుమారి మాట్లాడుతూ క్రీడలు ప్రతి మనిషి చక్కటి ఆరోగ్యాన్ని పొందేందుకు దోహదపడతా యన్నారు. శరీర దారుఢ్యం పెంపొందించి ఉత్సాహవంతమైన జీవనాన్ని పొందవచ్చునని తెలిపారు. ప్రతిరోజు వ్యాయామ నియమాలు పాటించాలని క్రీడాకారులకు ఆ క్రీడలే చక్కటి వ్యాయామం అని అన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడలలో పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి . శ్రీకాంత్, మండల రెవెన్యూ అధికారి బి. నాగరాజు నాయక్, మున్సిపల్ అధికారులు రెవిన్యూ అధికారులు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *