Breaking News

వేలాది మందితో ‘ఐజా’ ప్రజాయాత్ర…

-రానున్నది జనసేన, టీడీపీ ప్రభుత్వమే : షేక్‌ గయాజుద్దీన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్‌ గయాజుద్దీన్‌ (ఐజా)అన్నారు. గురువారం భవానీపురంలో స్వాతి సెంటర్‌ వద్ద ఉన్న జండా చెట్టు వద్ద నుంచి వేలాది మందితో ఐజా ప్రజాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గయాజుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు విజయడంఖా మోగించడం ఖాయమని అన్నారు. జనసేనాని పవన్‌కళ్యాణ్‌ నాయకత్వంలో జనసేన తెలుగుదేశం విజయం కోసం పాటుపడతామని చెప్పారు. యువతను తమ నాయకులు పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం వస్తుందన్న ఆశాభావాన్ని ఐజా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నిజమైన అంబేద్కర్‌ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతుందని ఐజా స్పష్టం చేశారు. వేలాదిమంది కార్యకర్తలు వెంటరాగా ఐజా కాలినడకన భవానీపురం, విద్యాధరపురం ప్రాంతాల్లో పర్యటించారు. దారి పొడవున ఐజాకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐజా జిందాబాద్‌ నినాదాలతో ఆ ప్రాంతాలు మారుమ్రోగాయి. తొలుత ఐజా ప్రజాయాత్రకు అనుమతి లేదని భవానీపురం సిఐ కృష్ణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జనసేన కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ యాత్రలకు లేని అడ్డంకులు జనసేన పార్టీకేనా అంటూ పలువురు నాయకులు ఆవేశాన్ని వ్యక్తం చేశారు. అయితే తర్వాత భవానీపురం సిఐ కృష్ణ పై అధికారులతో మాట్లాడి ఐజా యాత్రకు సమ్మతించారు. దీంతో వేలాదిమంది కార్యకర్తలు ఉత్సాహంగా వెంటనే నృత్యాలు, గరగలతో, తీన్మార్‌ కోలాహలంతో ఐజా పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆవుల ప్రసాద్‌, ఇస్మాయిల్‌, భారీ సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

​రాజమండ్రిలో ముగిసిన పోషణ్ మాహ్ ప్రదర్శన : ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరు

​రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *