రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రెండురోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆం.ప్ర రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కి ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ, ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి భీమ్ రావు, తిరుపతి థర్డ్ ఎడిజే జస్టిస్ ఎం. గుర్నాథ్, తదితర న్యాయమూర్తులు ఆం.ప్ర రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికిన వారిలో వున్నారు.
Prajavartha Online Telugu News