-రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ఆవశ్యకత తెలిపిన తర్వాత మాత్రమే ఈ నెల ఏప్రిల్ 30 తర్వాత ఇంటింటికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను బిఎల్వో లు పంపిణీ చేయాలి : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో ఇంటీరిం స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి మాట్లాడుతూ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ తెలిపిన తర్వాత మాత్రమే ఈ నెల ఏప్రిల్ 30 తర్వాత ఇంటింటికీ సంబంధిత నియోజక వర్గంలో ఇంటింటికీ ఓటర్ స్లిప్పులను బిఎల్వో లు పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని స్కిట్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కేంద్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి రవి శంకర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.
శ్రీకాళహస్తి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈవిఎం ల ఇంటీరిం స్ట్రాంగ్ రూం నందు పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈ వీ ఎంలు, వీ వీ ప్యాట్ లు అత్యంత భద్రత ఉండాలని, ఎన్నికల సామాగ్రి తగినంత చెక్ లిస్ట్ మేరకు అందుబాటులో ఉండేలా భద్రపరచుకోవాలని, రేపు పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్వాండమైజేషన్ ప్రక్రియ అబ్జర్వర్ల సమక్షంలో డిఈఓ గారిచే జరుగుతుందని, అలాగే ఈవిఎం రెండవ దఫా ర్వాండమైజేషన్ రిటర్నింగ్ అధికారులు స్థాయిలో మే 1న జరుగుతుందని, మే 2న నియోజక వర్గానికి కేటాయించబడిన పోలింగ్ సిబ్బందికి సంబంధిత నియోజక వర్గంలో రిటర్నింగ్ అధికారులు వారికి శిక్షణ కొరకు ప్రణాళికలు రూపకల్పన చేసుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తి లోని విస్తరణ శిక్షణ కేంద్రం నందు సుమారు 760 మందికి శిక్షణకు ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని అన్నారు.
అనంతరం మీడియా తో కలెక్టర్ మాట్లాడుతూ ఈవిఎం భద్రతకు రెండంచెల భద్రత ఏర్పాటు చేశామని, అందులో మొదటి లేయర్ నందు కేంద్ర బలగాలు, సెకండ్ లేయర్ నందు రాష్ట్ర పోలీస్ బలగాలు నిరంతర భద్రతతో పాటు సిసి కెమెరాల ద్వారా లైవ్ పరిశీలన ఉంటుందని తెలిపారు. ఈవిఎం ల వాడకంపై హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎఎస్డి లిస్ట్ ఏర్పాటుతో ఎలాంటి బోగస్ ఓట్లు పోల్ కాకుండా అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. జిల్లాలోని 2140 పోలింగ్ కేంద్రాలలో శ్రీకాళహస్తిలో 293 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అందులో 80 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, అందులో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.
అనంతరం శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 111, 112 మరియు 113 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి బిఎల్వో లతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ తెలిపిన తర్వాత మాత్రమే ఈ నెల ఏప్రిల్ 30 తర్వాత సంబంధిత నియోజక వర్గంలో ఇంటింటికీ ఓటర్ స్లిప్పులను బిఎల్వో లు పంపిణీ చేయాలని, తద్వారా అబ్సేంటీ, షిఫ్టెడ్, డెత్ (ఎఎస్డి) లిస్ట్ ఆ మేరకు తయారు కావాలని సూచించారు. హోమ్ ఓటింగ్, పీడబ్ల్యుడి ఓటర్ల వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు, ర్యాంపు, షేడ్ ఏర్పాటు, వీల్ చైర్ ఏర్పాటు, త్రాగు నీరు తదితరాల ఏర్పాట్లపై వారికి వివరించాలని తెలిపారు. నియోజకవర్గంలో పోలింగ్ విధుల నిర్వహణకు వచ్చే సిబ్బందికి వసతి ఏర్పాటు ఉండాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్.ఓ మరియు ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, డిఎస్పీ ఉమా మహేశ్వర రెడ్డి, మునిసిపల్ కమిషనర్ రమేష్, తాశిల్డార్ జనార్దన్ రాజు, శివరామ సుబ్బయ్య, బి ఎల్ వో లు, తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News