తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో 23- పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎం సి ఎం సి సెంటర్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
శనివారo సాయంత్రం తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గసాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ఎంసిఎంసి, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్ కంట్రోల్ రూం, సోషల్ మీడియా మానిటరింగ్ ను పరిశీలించి లోకల్ ఛానల్ టెలివిజన్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలకు సంబంధించి మీడియా లో వచ్చే ప్రతికూల వార్తలు, పిర్యాదులకు సంబందించి వివరాలను, సోషల్ మీడియాకు సంబంధించి ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్ మాధ్యమాలలో వచ్చే రాజకీయపరమైన ప్రకటనలకు ఎంసిఎంసి ప్రీసర్టిఫికేషన్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పీ ఆర్ ఓ ఈశ్వరమ్మ, అబ్జర్వర్ లైజన్ అధికారి సురేంద్ర ఉన్నారు.
Prajavartha Online Telugu News