గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ (ఆర్.ఓ)అధికారి కె. రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం పశ్చిమ నియోజకవర్గంలోని ఈ.వి.యం కమీషనింగ్ టీం, రిసెప్షన్ టీం మరియు డిస్ట్రిబ్యూషన్ టీంలతో నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్.ఓ మాట్లాడుతూ, ఎన్నికల విధులు అత్యంత కీలకమని, విధులు కేటాయించబడిన వారంతా సమన్వయంతో విధులు నిర్వహిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కు 32 టేబుల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, అవసరమైన సిబ్బందిని కేటాయించుట జరిగిందని తెలిపారు. ఈ.వి.యం ల కమీషనింగ్ కు కేటాయించబడిన సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, అసెంబ్లీ, పార్లమెంట్ కు వేరు వేరుగా కమీషనింగ ఉంటుందని, టెక్నికల్ టీం తో సమన్వయం చేసుకుంటూ ఉండాలన్నారు. రిసెప్షన్ టీం నిర్దేశిత సమయానికి విధులకు హాజరవ్వాలని, నిర్వహించవలసిన విధులలో ఎటువంటి సందేహాలు మరియు సమస్యలు ఉన్నా తమను సంప్రదించాలని, సదరు సమస్యలను పరిష్కరించుట జారుతుందని తెలియచేశారు.
సదరు సమావేశంలో ఏ.ఆర్.ఓ లు సి.హెచ్ శ్రీనివాసరావు, శీనా రెడ్డి, సూపరింటెండెంట్లు సాంబశివరావు, పద్మ, సెక్టార్ అధికారులు, ఇంజనీరింగ్ మరియు పట్టణ ప్రణాళిక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News