Breaking News

జోగి రమేష్ ప్రచారంలో అడుగడుగునా బ్రహ్మరధం పడుతున్న ప్రజలు 

యనమలకుదురు, నేటి పత్రిక ప్రజావార్త :
యనమలకుదురు గ్రామంలో బుధవారం రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ పర్యటనకు విశేష స్పందన లభించింది. దేశంలో ఎక్కడ లేనంత విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన జగనన్న ను ఆశీర్వదించి ప్రతి ఒక్క ఓటరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ పెనమలూరు వైసీపీ అభ్యర్ధి జోగి రమేష్ ఓటర్లను అభ్యర్ధించారు. జోగి రమేష్ కు తమ ఓటు ఫ్యాన్ గుర్తుకే వేస్తామంటూ జగనన్న లేనిదే రాష్ట్రం లేదంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంటూ ధైర్యంగా చెప్పడంతో జోగి రమేష్ కి ఆనందాన్ని ఇచ్చింది. ప్రజల ధైర్యాన్ని ఆయన అధికారులకు సూచిం చి పరిష్కార మార్గం చూపించారు. ఓటింగ్ పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి అభ్యర్ధులను గెలిపించాలంటూ ఆయన మరి మరి ఓటర్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఈడే చాముండేశ్వరి, మరీదు శ్రీనివాసరావు, గుమ్మడి విజయ్ కుమార్, కోషూరి నరేష్ కుమార్, గోపాల కృష్ణ, కసిరెడ్డి అనిల్ రెడ్డి, అష్రఫ్ సలీం, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *