Breaking News

20వ డివిజన్ ప్రాంతంలో అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
20వ డివిజన్‌ కృష్ణలంక రణధీర్‌ నగర్‌ కరకట్ట ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్‌ ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వైసిపి హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ అవినాష్‌ ముందుకు సాగారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ… రీటైనింగ్‌ వాల్‌ శంకుస్థాపన చేసినప్పటి నుంచి దానిని సకాలంలో పూర్తి చేసిన ఘనత జగన్‌ సొంతం ఇది ప్రారంభించినప్పుడే వైసిపి విజయం ఖాయమైందన్నారు. గత టీడీపి హయాంలో ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదు వైసీపీ హయంలో ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి గుమ్మం ముందు ఉంచామన్నారు. ఏ సమస్య వచ్చిన క్షణాల్లో కళ్ళ ముందు ఉండి పరిష్కారం చేశామన్నారు. డివిజన్‌లో ఐదు కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. జగన్‌కి ఈ ప్రాంతం అంటే ఇష్టం జగన్‌ ఇంటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఇక్కడ ప్రజల క్షేమం గురించి ఆరా తీస్తారన్నారు. గద్దె రామ్మోహన్‌ కాల్‌మని, బెట్టింగ్‌, సెక్స్‌ రాకెట్‌, గంజాయిలను ప్రోత్సహిస్తారన్నారు. అబద్ధాలు ప్రచారం చేయటానికి యెల్లో మీడియా ముందుకు వస్తారన్నారు. గద్దె రామ్మోహన్‌ చెప్పుకోవటానికి ఒక్క మంచి కార్యక్రమం కూడా చేయలేదన్నారు. గంజాయి కేసుల్లో దొరికే వారికి గద్దెకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను చెప్పే దాని మీద నా వద్ద ఆధారాలు ఉన్నాయి, నిరూపిస్తా మేము చేసిన అభివృద్దిని సిగ్గు లేకుండా టీడీపీనేతలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. దద్దమ్మ లేగా దిగజారి మా అభివృద్ది నీ గద్దె రామ్మోహన్‌ వారి ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ వయస్సులో గౌరవం లేకుండా గద్దె ప్రవర్తిస్తున్నారన్నారు. అసమర్ధ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాకొద్దు అని ప్రజలు చెప్పుతున్నారన్నారు. అవినాష్‌ అనే నన్ను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి రాబోయే కాలంలో మరింత కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *