Breaking News

కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను వెంటనే పునరావసం కేంద్రాలకు షిఫ్ట్ చేయండి

-రోడ్డుపైన మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోండి
-ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత వారం రోజులుగా నిరంతరంగా వర్షం కురవడం వల్ల కొండ ప్రాంతంలోని గోడలు నాని పగిలిపోవడం వలన కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఆపద ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ప్లానింగ్ మరియు ఎమినిటీస్ సెక్రటరీలను కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి, వాళ్లకు కలిగే ఆపద గురించి చెప్పడమే కాకుండా అవసరమైతే పునరావస కేంద్రాలకు వారిని తరలించాలని, జోనల్ కమిషనర్లు నిరంతరంగా సెక్రటరీలని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఆపద కలగకుండా చూసుకుంటూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదేశాలు ఇచ్చారు.

తన పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం సిద్ధార్థ నగర్, ఆంధ్రప్రభ కాలనీ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తన పర్యటించిన కొన్ని ప్రాంతాలలో రోడ్డు లెవెల్ కంటే పైనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాన్ హోల్ గమనించి, నగరంలో రోడ్లెవలు కంటే పైనున్న లేదా కింద ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాన్ హోల్ లను రోడ్డు లెవెల్ కి పెట్టాలని నగర పరిధిలో ఉన్న మూడు సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తమ తమ పరిధిలలో పర్యటించి ఇటువంటివి ఏమైనా గమనించినచో వెంటనే సరి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చారు.

సిద్ధార్థ నగర్, తోట వారి వీధి వీధిలో పారిశుద్ధ నిర్వహణ గమనించి, సరిగ్గా లేదని అక్కడ నివసిస్తున్న ప్రజలు సైడ్ డ్రైనలలో వ్యర్ధాలను పారివేయడం గమనించి, వ్యర్ధాల వల్ల సైడ్ డ్రైన్లు నిండిపోయి రోడ్డుమీద మురుగునీరు వస్తుంది కాబట్టి, ఆ మురుగు నీరు వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది అన్న ఉద్దేశంతో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ని అక్కడున్న ప్రజలకు వ్యర్ధాలను విజయవాడ నగరపాలక సంస్థ వ్యర్ధాల సేకరణ వ్యాన్ వచ్చినప్పుడే ఇవ్వాలని, సైడ్ డ్రైన్ లో ఎటువంటి వ్యర్ధాలను చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

ప్రజలందరూ వ్యర్ధాల సేకరణ వ్యాన్ వచ్చినప్పుడు మాత్రమే వ్యర్థలను విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బందికి ఇవ్వాలని, రోడ్డుమీద కానీ సైడ్ కాలువల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో వ్యర్ధాలను పారివేయకూడదని నగర ప్రజలను కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *