-ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచాము
-ఆఫ్ లైన్ లో ట్రాక్టర్ల ద్వారా వొచ్చి తీసుకొని వెళ్ళ వచ్చు
-త్రవ్వకాలు ప్రారంభించనీ బోట్స్ మ్యాన్ సొసైటి ల అనుమతులు రద్దు చేయాలి
-అధిక మొత్తం డిమాండ్ చేసే వారికి షో కాజ్ జారీకి ఆదేశం
-డి ఎల్ ఎస్ ఎ సమావేశంలో నిర్ణయం
-కలక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులకు పూర్తిస్థాయిలో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు డీసిల్టేషన్ పాయింట్స్, ఓపెన్ రిచ్ లని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, వాటిని పూర్తిస్థాయిలో పనిచేసేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షులు నిర్వహించగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక ను అందుబాటులో ఉండేలా 119 మంది బోట్స్ మాన్ సొసైటీలకు అనుమతులను ఇవ్వడం జరిగిందన్నారు. వీటిలో ఇప్పటివరకు సుమారు 30 సొసైటి లు కార్యకలాపాలు నిర్వహించడంపై కలెక్టర్ ఆసహనం వ్యక్తం చేశారు. అనుమతిలించిన ప్రతి ఒక్క సొసైటీ క్షేత్రస్థాయిలో త్రవ్వకాలు చేపట్టాలన్నారు. శనివారం రీచ్ లు వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆయా రీచులకు కేటాయించిన బోట్స్ మాన్ సొసైటీల తో మాట్లాడడం జరుగుతుందని పేర్కొన్నారు. బోట్స్ మ్యాన్ సొసైటి లకి ఇచ్చిన వర్క్ ఆర్డర్ కు అనుగుణంగా పనులు చేపట్టడం జరగాలన్నారు. జిల్లాలో 13 ఒపెన్ రిచ్ లలో ఆరు మాత్రమే పని చెయ్యడం ఏమిటి? మిగతా వాటి పరిస్థితి పై ప్రశ్నించారు.
ప్రజలకి పెండ్యాల , తీపర్రు , పందల పర్రు, వంగలపూడి ఒపెన్ రిచ్ లను అందుబాటులో ఉన్నాయనీ, వినియోగదారులు నిరభ్యంతరంగా తగిన ఆధారాలతో ట్రాక్టర్ ద్వారా వొచ్చి ఉచితంగా ఇసుకను తీసుకొని వెళ్ళలని కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ నిలవ ఉంచినా, అధికారికంగా తరలించినా, ఏదైనా బోట్స్ మ్యాన్ సొసైటి లు అధిక మొత్తం డిమాండ్ చేసినా అటువంటి వారికి షో కాజ్ నోటీసు ఇవ్వాలని ఆర్డీవో లని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ , ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఎడి మైన్స్ డి. ఫణి భూషణ్ రెడ్డి, డిటిఓ – ఆర్ సురేష్ , జిల్లా భూగర్భ జల అధికారి వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News