Breaking News

Tag Archives: nuzividu

భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి

-త్రాగునీరు,పారిశుధ్యం,విద్యుత్ సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలి -అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలి -జిల్లాలో అవసరాల మేరకు భద్రత చర్యలు ,సమాచార, సహాయ సహకారాల కేంద్రాలు పక్కాగా ఏర్పాటు చేయాలి ..రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి -అకాల వర్షం కారణంగా జిల్లాలో మరియు నూజివీడు నియోజకవర్గంలో మామిడి పంట నష్టం పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి , నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాలు కారణంగా అధికారులను అప్రమత్తంగాఉండాలని, పటిష్టమైన …

Read More »

శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు

-అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి శుభాకాంక్షలు -రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని , రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ఆలు పెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ‘మే డే’ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని అన్నారు. రాష్ట్ర …

Read More »

ముస్లీమ్ సోదరుల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం

-త్యాగానికి ప్రతీక రంజాన్.. -నూజివీడు ఈద్ గా త్వరలో మరింత అభివృద్ధి -ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. రంజాన్ సందర్బంగా నూజివీడు ముస్లీమ్ సోదరలు ఈద్గా పవిత్ర ప్రాంగణానికి వెళ్లి జిల్లా మరియు నూజివీడు ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.సుమారు 5వేల …

Read More »

గుంతలు లేని రోడ్లే లక్ష్యం

-20 కోట్లతో పలు రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు -నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తా -ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ప్రభుత్వము మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు/చట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం చాట్రాయి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార …

Read More »

మానవత్వం చాటుకున్న మంత్రి పార్థసారథి

-తాను ప్రజల సేవకుడిని అనడమే కాదు..చేతల్లో చూపిన మంత్రి -రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వెంటనే వైద్య సేవలందేలాచేసిన మంత్రి నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలంలో పర్యటన నిమిత్తం శుక్రవారం నూజివీడు లో మంత్రి కార్యాలయంనకు వస్తున్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం తుక్కులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూసి వెంటనే స్పందించారు. తాను స్వయంగా తన వాహనం దిగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెర్సీపూడి కి చెందిన …

Read More »

నూజివీడును రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెడతా..

-రాష్ట్ర సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి -నూజివీడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎం.ఆర్. అప్పారావు కాలనీలో త్రాగునీటి పైపులైన్ల నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు. ఎన్ .డి. ఏ . కూటమి వంద రోజుల పండుగ కార్యక్రమంలో భాగంగా ‘ఇది మంచి …

Read More »

ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా

-ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రికి ముఖ్యమంత్రి ఆదేశం -ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిని మంత్రి పార్థసారథి ని టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు -జిల్లా యంత్రాంగాన్ని అపప్రమత్తం చేసి ఎటువంటి నష్టం సంభవించకుండా పటిష్టచర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసిన మంత్రి పార్థసారథి నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్త్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార …

Read More »

స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు.స్పందన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే …

Read More »

జగనన్న భూ సర్వే పనులు వేగవంతం చేయండి : తహసీల్దార్లకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులను వేగవంతం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులపై సోమవారం డివిజన్ లోని తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వివాదాలు లేని భూ రికార్డులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం …

Read More »

స్పందనకు హాజరు కానీ అధికారులకు షోకాజ్ నోటీసులు : ఆర్డీఓ రాజ్యలక్ష్మి హెచ్చరిక

-స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలొగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ ఆర్డీఓ రాజ్యలక్ష్మి సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ఎం. హరనాథ్ ను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ …

Read More »