-పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక అవకాశం: కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27న శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక హక్కు అయిన వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రైవేటు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, బ్యాంకులు, విద్యాసంస్థలలో ఓటరుగా నమోదు చేసుకున్న ఉద్యోగులు, కార్మికులు వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతులు ఇవ్వడం, షిఫ్ట్‌లను సద్దుబాట్లు (అడ్జస్ట్) చేయడం వంటి వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
Prajavartha Online Telugu News