Breaking News

సమన్వయ శాఖల అధికారులతో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలో చేపల వేట ద్వారా జీవనో ధారం తో పాటు, పర్యటక అభివృద్ది పరంగా బోటింగ్, నది విహారం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. అయితే వీటికి సంబంధించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలక్టర్ స్పష్టం చేసారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నది జీవనం పై జీవనభృతి ఉన్న వారికి జీవనోపాధికి ఎటువంటి ఆటంకం లేకుండా, అదే సమయంలో ఎందు నిమిత్తం ఆయా బోటు లకు అనుమతులు ఇచ్చామో వాటిని ఉల్లంఘించకుండా ప్రామాణిక కార్య చరణ రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బోటు ప్రమాదాలలో, నదీ స్నానల సందర్భంలో మరణాలు సంభవించడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి ఘటనలను జరగకుండా తగిన నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.

ప్రమాదం జరిగిన సందర్భం మరియు నేపథ్యంపై సమన్వయ శాఖలు నివేదిక, భవిష్యత్తు లో ఇచ్చే అనుమతుల కోరకు అమలు చెయ్యవలసిన విధి విధానాలు పై సమగ్ర నివేదిక అంద చెయ్యాలని ఆదేశించారు. విహారం , చేపలు వేట, సరుకు రవాణా తదితర అవసరాల కోసం నౌకల నమోదు చేసుకున్న యెడల వాటికే వినియోగించేలా విజిలెన్స్ ఉండాలని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌ల ఎర్పాటు, ప్రమాద హెచ్చరికలు సూచికలు ఏర్పాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పర్యవేక్షణ , నిబంధనల విధి విధానాలు అమలు లో భాగంగా కంట్రోల్ రూమ్‌ల సిబ్బంది ఎర్పాటు , కంట్రోల్ రూమ్ సిబ్బంది బాధ్యతలు , సిబ్బందికి సామర్థ్య వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నౌకల, పడవుల , బోట్స్ నదిలలోనికి వెళ్ళే సందర్భంలో అనుమతులు , ఆన్‌బోర్డ్ కార్యకలాపాల కోసం , జల మార్గాల పెట్రోలింగ్ వ్యవస్థ పై సంబంధిత శాఖలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆయా శాఖల నిర్ధేశిత మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని కోరారు.
తగిన లైఫ్ జాకెట్లు, రక్షణ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నడపడానికి అనుమతులు ఇవ్వరాదని, వాటికీ తగిన గుర్తింపు సంఖ్య లైసెన్స్ ఇవ్వాలని, వాటిని ప్రదర్శించాలన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ కోసం శిక్షణ మరియు సామర్థ్యం పెంపుదల, ప్రమాదంపై ప్రతిస్పందన వ్యవస్థ సమర్థవంతమైన పనితీరు చూపడం ముఖ్యం అన్నారు. పై అంశలపై ఆయా శాఖల అధికారులు సమగ్ర నివేదిక 48 గంటల్లో అందచేయాలని కలక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో టూరిజం ఇన్చార్జి ప్రాంతీయ సంచాలకులు సి హెచ్ పవన్ కుమార్, జిల్లా టూరిజం అధికారి పి .వెంకటాచలం, జిల్లా ఇరిగేషన్ అధికారి గోపి నాథ్ , జిల్లా మత్స్య శాఖ అధికారి వి కృష్ణారావు, టూరిజం సహయ మేనేజర్ గంగా రాజు, ఫైర్, పోలిస్, విపత్తుల నిర్వహణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *