Breaking News

ఉగ్రవాదంపై ప్రజాగ్రహం

-అమాయక ప్రజలపై దాడి హేయమైన చర్య…
-పెనుసవాలుగా మారిన దేశ భద్రత..
-దేహం ముక్కలైన దేశాన్ని కాపాడుకుంటాం..
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వర్వయ్య
-ఉగ్రవాద చర్యను నిరశిస్తూ విజయవాడలో కొవ్వొత్తుల నిరసన
`

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జమ్ముకాశ్మీర్‌ పహల్గాం ప్రాంతంలో అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదంపై ప్రజాగ్రహం పెల్లుబిగింది. తీవ్రవాదం ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కేంద్ర పాలకులు ధీటjైున చర్యలు చేపట్టి దేశాన్ని కాపాడాలని కోరుతున్నారు. సామాన్య ప్రజలను బలిగొన్న తీవ్రాదానికి వ్యతిరేకంగా సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయవాడలోని లెనిన్‌సెంటర్‌ నందు కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రజెండాలు, ప్లకార్డులు చేత పట్టుకుని ఉగ్రవాదం నశించాలి…ప్రపంచ శాంతి వర్ధిల్లాలి..పాకిస్తాన్‌ తీవ్రాదం నశించాలని పెద్దఎత్తున నినాదాలు చేసి సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వర్వయ్య మాట్లాడుతూ అహ్లాదకరమైన ప్రదేశంలో చేదతీరుతున్న అమాయక ప్రజలపై తీవ్రాదులు దాడి అమానుషమని మండిపడ్డారు. ఈ దాడి తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా చర్చజరగాలని, దేశంలో శాంతి కొరకు చేపట్టివలసిన చర్యలుపై సమాలోచనలు చేయాలసిన అవసరం ఉందన్నారు. మాటాలతో కాకుండా తీవ్రమైన చర్యలతో ఉగ్రవాదాన్ని పూర్తిస్ధాయిలో అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తీవ్రవాదుల దాడిలో చనిపోయిన 26మందిలో 15మంది ముస్లింలే ఉన్నారని ఈ దాడి ఒక మతంపై జరిగిన దాడి కాదన్నారు. గత 35సంవత్సరాల్లో ఎన్నడు జరగని ఘటప చోటుచేసుకోవడం అత్యంత బాధకరమన్నారు. ఇది దేశ భద్రతకు సవాలుగా మారిందన్నారు. రాజకీయ ప్రయోజనాలను ప్రక్కనపెట్టి మతాలను, మీడియాలను వాడుకోవడం కాకుండా దేశ భద్రతకు సంబంధించిన అంశంపై కేంద్రప్రభుత్వంపై దృష్టిపెట్టి చర్యకు ప్రతిచర్య చేపట్టాలని కోరారు. దేశ భద్రత కోసం దేహాం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వమని కమ్యూనిస్టువాదులంగా దేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటామని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ పర్యాటరంగంలో అభివృద్ది చెందుతున్న ప్రాంతాన్ని దెబ్బకోట్టేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని అన్నారు. టూరిజం పర్యటనలో ఉన్న సామాన్య ప్రజలను తీవ్రాదులు పొట్టనపెట్టుకున్నారని ఈ చర్య హెయమైనది ఖండిరచారు. పొట్టనపెట్టుకున్నారని లౌకిక వ్యవస్ధపై జరిగిన దాడిని ముక్తకంఠంగా భారతీయ పౌరులందరూ దీటుగా ప్రతిఘటించాలని కోరారు. ఉగ్రవాదంపై పలు తీర్మానాలతో సరిపెట్టకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనేక భిన్న సమ్మేళమైన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్రవాద దాడుల్లో మృతి చెందిన కుటుంబాలకు సంతాం తెలియజేశారు. విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ది చెందుతున్న ప్రాంతంలో దాడికి పాల్పడం తీవ్రాదుల దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. దేశ భద్రతకు పెనుసవాలుగా మారిన తీవ్రవాదాన్ని అంతమెందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ డాదిలో చనిపోయిన సంఖ్య ఇప్పటి వరకు బీజేపీ పాలకులు బయటపెట్టకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశ ఆర్ధికవ్యవస్ధను అతలాకుతలం చేసేందుకు కుట్రపూరితంగా చేసిన ఈ చర్యను దీటుగా ఎదుర్కొని ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమోందించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ రవీంద్రనాథ్‌, సీపీఐ నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు, కార్యవర్గ సఢ్యులు బుట్టి రాయప్ప, కెవి భాస్కరరావు, తాడి పైడయ్య, పంచదర్ల దుర్గంబ, కోట్టు రమణారావు, కార్యవర్గం నాయకులు డివి రమణబాబు, సంగుల పేరయ్య, తూకం వీరయ్య, కొడాలి ఆనందరావు, ఓర్చు భారతి, దోనేపూడి సూరిబాబు, కంచర్ల నాగేశ్వరరావు, సింగంరాజు సాంబశివరావు, బుద్దె రాజా, ఎఐవైఎఫ్‌ నగర కార్యదర్శి లంకా గోవిందరాజు, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు యం సాయికుమార్‌, డివిజన్‌ నాయకులు పడాల కనకరావు, రొండపల్లి కృష్ణ, కరోది వెంకటేశ్వరరావు, పి రాము, చిన్నప్ప, చింటడ పార్యతి, విజయ్‌, కోండేటి శ్రీనివాసరావు, దుర్గసి రమణమ్య, ఎస్‌కె నజీర్‌, ప్రతిపాటి రాజు, కాకర్లపూడి విజయ్‌ మురిగేషన్‌ రాము తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *