Breaking News

జిల్లా లో కార్మిక చట్టం ప్రకారం 17 కేసులను నమోదు చేసి రూ.96,118/- మేర పరిహారం చెల్లింపు

-బాల కార్మికుల గుర్తింపు కొరకు జూన్ 30 వరకు ప్రత్యేక డ్రైవ్
-నోడల్ ఆఫీసర్, జిల్లా రెవి న్యూ అధికారి, టి. సీతారామ మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో కార్మిక చట్టం ప్రకారం 17 కేసులను నమోదు చేసి రూ.96,118/- సొమ్మును పరిహారం గా కార్మికులకు ఇప్పించుట జరిగిందని నోడల్ ఆఫీసర్, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లో డిఆర్ఓ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామమూర్తి మాట్లాడుతూ బాల మరియు కౌమార కార్మికుల (నిషేధం మరియు నియంత్రణ) చట్టం, 1986 లోని నిబంధనల అమలు కొరకు వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ సహకారముతో జిల్లా టాస్క్ ఫోర్స్ పని చేస్తుందన్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతీ బుధవారం కార్మిక శాఖ అధికా రులు ప్రత్యెక డ్రైవ్స్ నిర్వహిం చడం ద్వారా జిల్లలో బాల కా ర్మికుల సంఖ్య గణనీయముగా తగ్గిందని మరియు గత రెండేళ్లుగా తనిఖీలు నిర్వహించి, 28 వృత్తులు మరియు ప్రక్రియలలో ఉల్లంఘనలు గుర్తించి చట్టాన్ని అతిక్రమించిన యజమానులపై సంబంధిత కోర్టులలో ప్రొసీక్యూషన్ లు ఫైలు చేశా మన్నారు. కనీస వేతనముల చట్టం, 1948 క్రింద వేతనాల తేడాల ను గుర్తించి 17 కేసులను నమోదు చేసి రూ.96,118/- లను పరిహారంగా కార్మికులకు ఇప్పించుట జరిగిందని తెలిపారు. బచ్పన్ బచావో ఆంధోలన్, విజయవాడ, కమీషనర్, కార్మిక శాఖ, విజయవాడ వారి ఆదేశముల మేరకు జూన్ 1 నుంచి జూన్ 30 వ తేదీ వరకు జిల్లా టాస్క్ ఫోర్స్ డి.టి.యఫ్.ఆధ్వర్యంలో బాల కార్మికుల గుర్తింపు కొరకు ప్రత్యే క డ్రైవ్ ను నిర్వహించను న్నట్లు సహాయ కార్మిక కమీషనర్ బీఎస్ఎమ్ వలి తెలిపారు. ఈ సమావేసం లో సహాయ కార్మిక కమీషనర్, బి.యస్. యం. వల్లీ, జిల్లా టాస్క్ ఫోర్స్ (డి.టి.యఫ్.) సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *