Breaking News

నగరంలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు


విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ హిందూ ధార్మిక సదస్సు కార్యక్రమం శ్రీ శ్రీనివాసనంద సరస్వతీ స్వామీజీ అధ్యక్షతన ఈరోజు విజయవాడ గాంధీనగర్, ఐలాపురం హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ పాల్గొన్నారు. శ్రీనివాసనంద సరస్వతీ స్వామీజీ, పి వి ఎన్ మాధవ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించాలని, భారతీయ అత్యుత్తమ విలువలను ఇప్పటికీ కూడా ప్రపంచంలో 80% ప్రజలు తెలుసుకో లేకపోతున్నారన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. భారతదేశం విశ్వగురు అయ్యే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సులో సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు అట్లూరి నారాయణరావు తీర్మానాలు ప్రవేశపెట్టారు.

* దేవాలయాల పైన ఇచ్చిన వివాదాస్పద జీవోను వెంటనే రద్దు చేయాలి.
* దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో ధార్మికులను మాత్రమే నియమించాలి.
* తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా ప్రకటించి, మద్యం, మాంసం రహితంగా చేయాలి. *హిందువుల పండుగలు, ఊరేగింపులకు ప్రభుత్వం రక్షణ కలిగించాలి.
* గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి. *అయోధ్య, కాశీయాత్రలకు వెళ్లే భక్తులకు ఆర్థిక సహాయం చేయాలి.
* ప్రతి ఆలయ అర్చకుడికి గౌరవ వేతనాలు 10000 రూపాయలు ఇవ్వాలి.
* దేవాలయ భూముల్లో గోశాలలు ప్రతి గ్రామంలో నిర్వహించాలి.
* బంజరు భూములు గోశాలలోని గోవుల గడ్డి పెంచేందుకే వాడాలి.
* టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ నూతన విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
* దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ప్రతి దేవాలయము యొక్క ఆదాయ వ్యయాలు, ఆభరణల వివరాలు, భూములు, ఆస్తులు వివరాలు ఆన్లైన్లో ఉంచాలి.
* ఆశ్రమాల నిర్వహణకు నిధులు కేటాయించాలి.
* రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలు పొంది మతం మారిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి.
* 60 సంవత్సరాలు దాటిన ధార్మిక వానప్రస్థ గురువులకు వేతనాలు ఇవ్వాలి.
* టిటిడి స్వయంగా గోశాల నిర్వహించి ఆ గోవుల నెయ్యిని లడ్డు తయారీకి ఉపయోగించాలి.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధికార ప్రతినిధి తురగా శ్రీరాం, ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రవి మరియు సాధువులు 300 మంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *