Breaking News

జిజిహెచ్ ను సందర్శించిన జెసి ఎల్. శివశంకర్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) లోతేటి శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని(జిజిహెచ్) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అభివృద్ధి పనులను, పలు విభాగాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులతోను వారి బంధువులతోను మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య అధికారులతో సమావేశమై ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి పనులు, నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.  ఈసమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. జగన్మోహనరావు, ఆర్‌యంఓ డా. శోభ, సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, ఏపి ఎంఎడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *