Breaking News

జగనన్న పాలవెల్లువ పథకంతో పాడి రైతులు జీవనవిధానం మెరుగు…

-జగనన్న పాల వెల్లువ పధకాన్ని ప్రతీ పాడి రైతు సద్వినియోగంచేసుకోవాలి

రెడ్డిగూడెం,  నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా పాడి రైతుల జీవన విధానం మెరుగుపడిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజ పర్వ గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై పాడి రైతులు, ప్రమోటర్లు, అధికార్లతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పాడి రైతుల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. జగనన్న పాల వెల్లువ పధకాన్ని ప్రతీ పాడి రైతు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలన్నారు. పాడి రైతులు జీవన స్థితిగతులను పాలవెల్లువ కార్యక్రమం మార్చిందన్నారు. అమూల్ సంస్థ గత 70 సంవత్సరాలుగా పాల డెయిరీ వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిందన్నారు. అమూల్ సంస్థ సహకార సంఘాల పద్దతిలో 27 లక్షల మంది పాడి రైతులు యజమానులుగా కలిగిన సంస్థన్నారు. , రైతుల జీవనశైలిని అమూల్ సంస్థ మారుస్తుందన్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ డైరీలు సేకరించిన పాలకు తక్కువ వెన్న శాతం చూపించేవారన్నారు. వెన్న శాతం లెక్కింపులో అమూల్ సంస్థ ఖచ్చితత్వంతో ఉంటుందన్నారు. దీనితో పాడి రైతులు అందించే పాలకు ప్రైవేట్ డైరీల ధరకన్నా అమూల్ సంస్థ లీటరుకు 5 నుండి 12 రూపాయల వరకు అధికంగా అందిస్తున్నదని, దీనికారణంగా పాడి రైతులు గతంలో కన్నా నెలకు 5 వేల రూపాయల అధికాదాయాన్ని పొందుతున్నారన్నారు. .రాష్ట్రంలోని 8 జిల్లాలలోని పాడి రైతుల నుండి అమూల్ సంస్థ పాలను 6 నెలల నుండి సేకరిస్తున్నదని, ఆయా జిల్లాలో అమూల్ సంస్థకు పాలు పొసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నదన్నారు. పాడి పశువులకు నాణ్యతతోకూడిన దాణా, పశువులకు వైద్య సహాయం వంటి కార్యక్రమాలను అమూల్ సంస్థ అందిస్తుందన్నారు. అంతేకాక పాడి రైతులకు పాడి పశువులు కొనుగోలు నిమిత్తము స్వల్ప, దీర్ఘ కాలిక రుణాలను అందిస్తున్నదన్నారు. జగనన్న పాల వెల్లువ ప్రయోజనాలను మరింత మంది పాడి రైతులు వినియోగించుకునేలా ప్రమోటర్లు, అధికారులు, వాలంటీర్లు అవగాహన కలిగించాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే జగనన్న పాలవెల్లువపధకం పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేలా మహిళలు సహకరించాలన్నారు. అనంతరం గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అర్హులైన ప్రతీఒక్కరు అందేలా వాలంటీర్లు, సిబ్బంది పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ , ఎంపిడిఓ , పశుసంవర్ధక శాఖ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *