Breaking News

ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తాం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి పట్టణం లోని రోడ్డు ప్రక్కనున్న  ట్లాన్స్ ఫార్మర్ల వద్ద ఫెన్సింగ్ తో పటిష్ట భద్రత ప్రజలకు రక్షణ కల్పింనున్నట్లు E.E .హరిబాబు (APCPDCL) అన్నారు. శుక్రవారం చెంచుపేటలో  విద్యుత్ వినియోగదారుల సమస్యలపై జరిగిన సదస్సులో  కరెంటు తీగెలు బయటకు వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయన్న దాని పై విథంగా స్పందించారు. అలాగే  చినపరిమి లో 6నెలల నుండి పెండింగ్ లోని వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వనున్నట్లు , గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ అనథికార కోతలను నివారిస్తామన్నారు. ఇకపై ప్రతినెల మూడో శుక్రవారం వినియోగదారుల సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో బకాయలు 5.5కోట్లు బకాయి పడ్డారని వారు చెల్లించాలని కోరగా సామాన్య వినియోగదారుడు వంద బకాయిపడితే ఫిజు తీస్తారని అదే ప్రభుత్వ కార్యాలయాల పై ఉదాశీనత ఎందుకనగా  ఆయన నుండి స్పష్టమైన సమానథానం లేదు. ఈ వినియోగదారుల సదస్సులో DEE లు టౌను అశోక్ కుమార్ గ్రామీణ1 తేజోపంత్ గ్రామీణ 2 కృష్ణారావు AE లతో  తెనాలి డివిజన్ విద్యుత్ వినియోగదారుల సభ్యుల బొమ్మ దేవర వేంకటేశ్వరావు,శాస్త్రి , యక్కల రామ్మెహన్ కొల్లూరి మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *