Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిసిన డెమోక్రటిక్ PRTU నాయకులు

-ఈనెల 24న జరగనున్న మంత్రి జోగి రమేష్ అభినందన సభకు విశిష్ఠ అతిథిగా విచ్చేయాలని ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని డెమోక్రటిక్ PRTU నాయకులు సోమవారం ఆంధ్రప్రభకాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 24న హోటల్ ఐలాపురంలో జరగనున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభినందన సభకు విశిష్ఠ అతిథిగా విచ్చేయాలని కోరారు. ఈ సందర్భంగా దుశ్శాలువతో సత్కరించి ఆహ్వానపత్రికను అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షులు డి.శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షులు జ్ఞానేశ్వరరావు, నాయకులు ఆనంద్ రావు, బాల సుందర్, అబ్రహాం లింకన్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *