Breaking News

విద్యాశాఖలోని వైఫల్యాలే ప్రభుత్వ విద్యకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శాపంగా మారింది… : వేముల శ్రీనివాస్ 

-రాష్ట్రంలో ప్రభుత్వ విద్య వెంటిలేటర్ పై ఉంది అనటానికి నిన్న వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలే ఒక ఉదాహరణ.
-విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులు గడచిన కోవిడ్-19 (కరోనా) అనే బూచి చూపించి తమ వైఫల్యం నిర్లక్ష్యాలను దాచుకోవాలని చూడటం దారుణం..
-కరోనా అధిగమించి రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో వుందని చంకలు చరుచుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఎందుకు విఫలమైందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల రీ వెరిఫికేషన్ కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ చేసారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో నిన్న విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలు అందరినీ నిరుత్సాహపరిచాయనీ, ఈ విద్యా సంవత్సరం కేవలం 67% ఉత్తీర్ణతతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనీ, ముఖ్యంగా రాజధాని నగరంలో ప్రభుత్వ విద్య పడకేయడం దారుణాతిదారుణమనీ, నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో 50 శాతం ఉత్తీర్ణత సాధించడం కోసం నానా కష్టాలు పడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడిందన్నారు. కోవిడ్ వల్లనే ఈ విద్య సంవత్సరం ఇబ్బంది కలిగిందని విద్యాశాఖ అధికారులు అనడం విడ్డూరంగా ఉందని రాష్ట్రంలోనే విద్యాశాఖ అధికారులు విద్యా శాఖ మంత్రి కోవిడ్ అనే బూచి చూపించి తమ వైఫల్యాలను, అసమర్ధతను కప్పి పుచ్చుకోవడం సబబు కాదని, కరోనా అధిగమించి రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో వుందని చంకలు గుద్దుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఎందుకు విఫలమైందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. షుమారు 2,15,000 మంది పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రప్రథమం ఈ ఘనత సాధించిన ప్రభుత్వంగా వైసిపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారన్నారు. కరోనా వలన రెండు విద్యా సంవత్సరాల వెనుకబడిన విద్యార్థుపై ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి సబ్జెక్టులపై ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకుండా వారిని గాలికి వదిలేయడం వల్లనే విద్యాశాఖ ఈ ఫెయిల్యూర్ పాపం మూటగట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల అంకమ్మరాజు, రాయవరపు రాజు, ఉప్పు జస్వంత్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *