విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో పంట నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా ఆపన్న హస్తం లాంటిదని గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్సార్ పంటల బీమా పథకం కింద 29,949 మంది రైతులకు 123.29 కోట్ల రూపాయలు బీమా పరిహారాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
మైలవరంలోని ఎస్‌విఎస్ కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ`క్రాప్ నమోదైన పంటల ప్రామాణికంగా బీమా సౌకర్యాన్ని వర్తింప చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు చేపట్టిన ప్రతీ పంటను ఈ`క్రాప్‌లో నమోదు చేసి రశీదు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలకు గురి అయిన పంటలను శాస్త్రీయంగా అంచనా వేసి అర్హులైన ప్రతీ ఒక్కరికి పంట నష్ట బీమాను అందిస్తున్నామన్నారు. జిల్లాలో 2,949 మంది రైతులకు123.29 కోట్ల రూపాయలు పంటల బీమా కింద మంజూరైన ఆర్థిక సహాయన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సిద్దం చేయడం జరిగిందని ఆయన అన్నారు. పారదర్శకతను పాటిస్తూ గ్రామ సచివాలయాలలో అర్హుల జాబితాను ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ విధానం వలన రైతులు దళారీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఎటువంటి అవస్థలు పడకుండా బీమా సొమ్మును పొందగలుగుతున్నారన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఈ `క్రాప్, ఇకెవైసి నమోదు చేసుకుంటే తప్పనిసరిగా నష్టపరిహారం మంజూరు అవుతుందని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఖరీప్ సాగుకు సిద్దమవుతున్న రైతులకు అండగా గత ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం 2,977.82 కోట్ల రూపాయలు బీమా పరిహారాన్ని నేడు రైతు ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా రైతుల తరుపున ప్రీమియం చెల్లింపు భాధ్యతను ప్రభుత్వం తీసుకుని ప్రతీ ఎకరాన్ని ఈ `క్రాప్‌లో నమోదు చేసి పంటలకు బీమా రక్షణ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాన్ని అదే సీజన్ ముగిసే లోపు రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీని అందిస్తున్నామన్నారు.
వైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, దాన్యం కొనుగోలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, సూక్ష్మ సెద్యం, పంటతోటల అభివృద్ధి, వైఎస్సార్ యంత్ర సేవా పథకం, విత్తనాల సబ్సిడీ వంటి పథకాల ద్వారా రైతన్నలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 1,27,823 కోట్ల రూపాయలు లబ్ది చేకుర్చారన్నారు.
తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మంచి చేయాలన్న ఆలోచనలతో పాటు వారికి ఏ కష్టం, నష్టం వచ్చినా అండదండలు అందిస్తూ తోడుగా నిలిస్తున్నారన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిగా ప్రతీ రైతు హృదయంలో ఆయన చిరస్థాయిగా నిలుస్తారన్నారన్నారు.
కార్యక్రమంలో తొలుత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం. విజయభారతి, యంపిటిసిలు యం. చక్రదరరావు, ఎస్ తిరుపతి రావు, యంపిపి లక్ష్మితిరుపతమ్మ, జడ్పిటిసి వైస్ చైర్మన్ జి శ్రీదేవి, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Prajavartha Online Telugu News