-దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ విజయవాడలోని డివిజినల్ కాన్ఫిరెన్స్ హాలులో నేడు అనగా 16 జూన్ 2022 తేదీన విజయవాడ డివిజిన్ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
అరుణ్ కుమార్ జైన్ విజయవాడ్ డివిజన్ సరుకు రవాణా లోడిరగ్ పనితీరుపై విస్తృతంగా సమీక్షించారు మరియు సరుకు రవాణా రంగంలో గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం కనబరుస్తున్న విశిష్ట పనితీరుకు కృషి చేస్తున్న బ్రాంచ్ అధికారులను అభినందించారు మరియు ఇదే పనితీరును ఇకపై కూడా కొనసాగించాలని అన్నారు. జనరల్ మేనేజర్ జరుగుతున్న మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. కీలకమైన ప్రాంతాలలో ఆర్‌యూబీ నిర్మాణ పనులు మరియు ఎల్‌సీ గేట్ల తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సూచనలు చేశారు. డివిజన్‌లో మచిలీపట్నం యార్డ్ పునర్నిర్మాణం, అరవల్లి మరియు నిడదవోలు మధ్య డబ్లింగ్ పనులు, గూడూరు`విజయవాడ మూడవ రైల్వే లైను పనులు మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద ప్లాట్‌ఫారం 4 & 5 ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సెక్షన్‌లో రైళ్ల వేగం మరియు సమయపాలన పాటించాలని అందుకు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. రైల్వే ఆస్తులు నష్టపోకుండా వాటి సంరక్షణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి రైళ్ల సమయపాలన మెరుగుదలకు కృషి చేయాలని ఆయన ఆధికారులను ఆదేశించారు. భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా తగు చర్యలను చేపట్టాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు. ఇందుకు గాను నిరంతరం ట్రాక్ పటిష్టతకు తగిన తనిఖీలు నిర్వహించాలని, దీనిద్వారా ఎప్పటికప్పుడు అత్యవసర సమయాలలో తగిన చర్యలు తీసుకోవచ్చని ఆయన అధికారులకు సూచించారు.
సరుకు రవాణాలో సిమెంట్, బొగ్గు, ఎరువులు, ఆహారధాన్యాలు వంటి లోడిరగ్‌కు కృష్ణపట్నం మరియు కాకినాడ పోర్టుతో సహా అన్ని ముఖ్య లోడిరగ్ ప్రాంతాల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ అధికారులకు సూచించారు. సెక్షన్‌లో టెర్మినల్‌లో రద్దీని తగ్గించి మరియు రవాణాలో అడ్డంకులను తొలగించి వ్యాగన్లను మరింత సమర్థవంతంగా ఉపయోగించేందుకు కృషి చేయాలని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ ఆర్.ధనంజనేయులు మరియు దక్షిణ మధ్య రైల్వే రోడ్ సేఫ్టీ వర్క్స్ చీఫ్ ఇంజినీర్, జి.వి.రమణా రెడ్డి కూడా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News