విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ 46వ సచివాలయ పరిధిలోని పి&టి కాలనీ ప్రాంతంలో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి,ఈ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులు గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి,లాంచలకు తావులేకుండా పారదర్శకంగా నేరుగా మహిళల ఖాతాలలోనే నగదు జమ చేయడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.తెలుగుదేశం పార్టీ కి బలముంది అని వారు ప్రచారం చేసుకొనే ఈ 11వ డివిజన్ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ గా గెలిచాక ఈప్పటివరుకు డివిజన్ మొహం చుసిన రోజు లేదు అని స్థానిక ప్రజలు ఓటు ఎందుకు వేశామా అని వాపోతున్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం లోనే మాకు మేలు జరుగుతుంది అని ప్రజలు అంటున్నారు. రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపటినట్టు తెలిపారు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఏదైనా పధకం రాకపోతే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటిలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేశారో వారికి సవివరంగా వివరించి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక వైస్సార్సీపి ఇంచార్జ్ పర్వతనేని పవన్,వైస్సార్సీపీ నాయకులు సందీప్ రెడ్డి,దుర్గాప్రసాద్,కోలా లవ,చక్రవర్తి,విజయ్,మాజీ డిప్యూటీ మేయర్ఆళ్ల చెల్లారావు,రామాయణపు శ్రీనివాస్,ఉకోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News