Breaking News

సర్వే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యండి

-సర్వే రాళ్ళు ఏర్పాటులో భూ యజమానులను భాగస్వామ్యం చెయ్యాలి
-త్వరిగతిన రాళ్ళు ఏర్పాటుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
-జాయింట్ కలెక్టర్ శ్రీధర్

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి డివిజన్ పరిధిలో అనపర్తి, బిక్కవోలు మండలాల్లో సర్వే పూర్తి అయిన రామవరం, గ్రామాల్లో సరిహద్దులు సూచించే రాళ్ళు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు.

శుక్రవారం అనపర్తి మండలం రామవరం, బిక్కవోలు మండలం తోత్తుపూడి గ్రామాల్లో జేసీ పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, సర్వే పూర్తి అయిన గ్రామ లకు చెందిన భూ యజమానులు, రైతులు అందరూ గ్రామ రెవెన్యూ అధికారి ని సంప్రదించి వారి భూమిలో స్వచ్చందం గా రాళ్లు పాతుకోడానికి ముందుకు రావాలని కోరారు. మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి లో ప్రతి ఒక్కరికీ ఈ విషయం పై అవగాహన కలిగించడం ముఖ్యం అన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నమని తహశీల్దార్లు జాయింట్ కలెక్టర్ కి వివరించారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటని జేసీ తెలిపారు. నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోని డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు ద్వారా సర్వే నిర్వహించాలన్నారు.

అనపర్తి మండలం రామవరం గ్రామానికి సరఫరా చేసిన 277సర్వే రాళ్ళను ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. మండలంలో మిగిలిన లక్ష్యాలను కూడా పూర్తి చేసేయాలని ఆయన స్పష్టం చేశారు. కుదుకూరు గ్రౌండ్ ట్రుతింగ్ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలన్నారు.

బిక్కవోలు మండలం తోత్తుపూడి గ్రామంలో స్టోన్ ప్లాంటేషన్ పనులను జేసీ పరిశీలించారు. గ్రామ పరిధిలో 400 రాళ్ళు ఏర్పాటు చెయ్యాల్సి ఉండగా 144 రాళ్ళు ఏర్పాటు చేయడం పై వివరణ కోరారు. భూ యజమానులతో సమన్వయం చేసుకుంటూ, వారిని కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా సర్వే రాళ్ళ ను ఏర్పాటు చేయాలని జేసీ ఆదేశించారు.సర్వే రాళ్ళును ఆయా భూయజమానులు , రైతులు గ్రామ రెవెన్యూ అధికారి ని సంప్రదించి , వారి భూమిలో సర్వే రాళ్ళు పాతుకోవడానికి ముందుకు రావాలని ఆయన తెలియచేశారు.

ఈ పర్యటనలో భాగంగా కుతుకులూరు సచివాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పందన ఫిర్యాదులు, ఓ టీ ఎస్, సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలు అడిగారు. ప్రజలకు పౌర సేవలు అందించే దిశగా సమయ పాలన, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జేసీ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో తహశీల్దార్లు కే వి మాధవరావు, శశిధర్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *