Breaking News

శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలి…

-పిచ్చి మొక్కలు, వేర్లు తక్షణమే తొలగించే రక్షణ చర్యలు చేపట్టాలి.
-సొరంగం రహదారిని వెంటనే పునరుద్ధరించాలి.
-కొండ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు
-VMC బడ్జెట్ లో కొండ ప్రాంతాలు అభివృద్ధి కేటాయించింది కేవలం 55 లక్షలే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సొరంగం వద్ద కొండ పైభాగం నుంచి రాళ్లు జారిపడి రహదారి మూసివేసిన ప్రాంతాన్ని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ డివిజన్ అధ్యక్షులు మల్లెపు. విజయలక్ష్మి, బొమ్ము. రాంబాబు, కొరగంజి. రమణ, పొట్నూరి శ్రీనివాసరావు, తదితరులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సొరంగం పై నుండి రాళ్ళు జారిపడుతున్న కనీస రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు మరియు అధికార పార్టీ వైఫల్యం చెందారని, స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కు అవినీతిమీదే గాని నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి లేదని, వెంటనే అధికారులు సొరంగం వద్ద పిచ్చిమొక్కలు, వేర్లు తొలగించి రక్షణ చర్యలు చేపట్టి రహదారిని వెంటనే పునరుద్ధరించాలని, భవానిపురం నుండి రోజు వేలాదిగా ప్రజలు సొరంగం ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారని, ఈ మార్గం గుండా రాకపోకలు నిలిపివేస్తె సితార సెంటర్ మీదుగా నాలుగైదు కిలోమీటర్ల దూరం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అందువలన తక్షణమే అధికారులు రాళ్ళు జారి పడిన ప్రాంతం వద్ద రక్షణ చర్యలు చేపట్టి తక్షణమే మార్గాన్ని పునరుద్ధరించాలని, గత 30 సంవత్సరాలలో ఎప్పుడు రాళ్లు జారి పడటం వల్ల ఈ దారి మూసివేయి లేదని, చిన్నపాటి వర్షం పడితే కొండ ప్రాంత ప్రజల గుండెలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని ,విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి రక్షణ చర్యలు చేపట్టాలని అదేవిధంగా కొండ ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గడపగడపకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కు రాళ్ళు జారిపడిన ప్రాంతాన్ని సందర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేవినే నాగరాజు, పోలి శెట్టి శివ బావిశెట్టి శ్రీను, అఖిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *