Breaking News

రాష్ట్రపతి ద్రోపతి ముర్ముతో భేటీ అయిన గవర్నర్ హరి చందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాష్ట్రపతి  ద్రోపతి ముర్ముతో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ మంగళవారం భేటీ అయ్యారు. సోమవారం భారత 15వ రాష్ట్రపతిగా ద్రోపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ లో ద్రోపతి ముర్మును మర్యాద పూర్వకంగా కలిసిన గవర్నర్ విభిన్న సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇటు గవర్నర్, అటు రాష్ట్రపతి ఇరువురు ఒడిశాకు చెందిన వారు కావటం విశేషం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *