రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు జిల్లాలో ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ విధానాన్ని చేపట్టనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని డిఆర్వో ఛాంబర్ లోఓటర్ల జాబితా డిజిటలైజేషన్ విధానం, సవరణ కి సంబంధించి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ బి. సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి డిజిటలైజేషన్ ప్రారంభించడంలో భాగంగా బి ఎల్ ఓ లకి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటరు జాబితా ను డిజిటలైజేషన్ చేసే విధానం అమలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం చెయ్యాల్సిన అవసరం దృష్ట్యా అందుకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయం సిబ్బంది ని బూత్ లెవెల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారని, వాలంటీర్ లను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చెయ్యడం జరగదని తెలిపారు. క్షేత్రస్థాయిలో తగినంత మానవ వనరులు ఉన్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఇచ్చే లక్ష్యాలను 2022 సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించి మార్చి 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసెందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి సేకరించిన డేటా ను కంప్యూటరై జేషన్ కోసండేటా వివరాలు తప్పులు లేకుండా నమోదు చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకత్వంలో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టడం జరుగుతుందని డి ఆర్ వో అన్నారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 800 నుంచి 1500 వందల వరకు ఓటర్లు ఉంటారని, వీటిని రేషలైజేషన్ చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు మేరకు ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆధార్ కార్డు ద్వారా లేదా ప్రభుత్వ గుర్తించిన ఫోటో ఐ డి ద్వారా ఓటరు గుర్తింపు ను అనుసంధానం చేయడం జరుుతుందన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని ఈ నేపథ్యంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు సహకరించాలని డిఆర్వో డి సుబ్బారావు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో యువత కు మరిన్ని అవకాశాలు భారతదేశ ఎన్నికల కమిషన్ కల్పించడం జరిగిందని తెలిపారు. 17+ ఏళ్ళ యువకులు ఓటరు జాబితా లో తమ పేర్లు నమోదుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చు, ఇంతకు మునుపులా జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు వచ్చేంత వరకు వేచి ఉండవలసిన అవసరం లేదన్నారు. భారత ఎన్నికల సంఘం సిఫార్సులననుసరించి, న్యాయ మంత్రిత్వ శాఖ, మునుపటిలా ఒకే అర్హత తేదీ జనవరి 1 కి కాకుండా, నాలుగు అర్హత తేదీలను, అంటే జనవరి 1, ఏప్రిల్1, జూలై 1 మరియు అక్టోబర్ 1 తేదీలకు యువకులు ఓటర్ల జాబితాలో నమోదు చేసుకొనడానికి అర్హతగా వీలు కలిగేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించిందని తెలిపారు. ఈ ప్రక్రియ లో జిల్లా యంత్రాంగానికి.. ప్రజలకు మధ్య వారధి గా రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కోరారు. హాజరైన పొలిటికల్ పార్టీ ప్రతినిధులు టిడిపి పార్టీ – ఆళ్ళ గోవిందు,బిజెపి – పి.రాధ కృష్ణ, ఇండియన్ కాంగ్రెస్ – మురళీకృష్ణ, సిపిఐ (ఎమ్) – ఎస్ ఎస్ మూర్తి, ఐ ఎన్ సి – బి మురళీధర్, బీఎస్పీ – పట్నాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News