-అటువంటి గురువులను పూజించుకోవడం మన కర్తవ్యం
-రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత నిస్తోంది.
-కంటికి కనిపించే దైవం గురువు..
-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత
-ఎంపీ.మార్గాని భరత్ రామ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లి జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని అటువంటి గురువులను పూజించుకోవడం మన కర్తవ్యం మని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. పాఠశాలలో వచ్చే చిన్న మరమ్మత్తులను చేపట్టి మరింత సమర్థవంతంగా స్కూల్ నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ కోరారు. అందుకు జిల్లా యంత్రాంగం తరపున ఉపాధ్యాయులకు సహాయ సహకారాలు అందజేస్తా నన్నారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని పురస్కరించుకొని సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ షర్మిలరెడ్డి,డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు,డిఈవో అబ్రహం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పుష్పమాల వేసి అంజలి ఘటించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లోని ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు కూడా గురువుల నుంచి జీవితం పొందారన్నది వాస్తవం అన్నారు.. అటువంటి గురువులను సన్మానించడం ఒక అవకాశం అన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందన్నారు. గతంలో స్కూల్స్ తనిఖీ వెళ్లాలంటే ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలు చెప్పేవారని, కలెక్టర్ హోదాలో వెళ్ళడం వల్ల ఆ స్కూల్ కి మటుకు ఆరోజుల్లో వారికి చేతనైన పనులు చేపట్టే వారన్నారు. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారాయని నాడు నేడు కింద రెండో దశ లో 675 స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు వంటి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం విద్యకు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తాయనే ఆలోచన కలిగి ఉన్నారన్నారు. అమ్మావఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక తదితర కార్యక్రమాలు ద్వారా ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా ఉపాధ్యాయులు కూడా సహాయ సహకారాలు తమ వంతుగా అందచెయ్యల్సి ఉందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనకు అనుగుణంగా బోధన విషయంలో మరింతగా ఉపాధ్యాయులపై బాధ్యత పెరిగిందన్నారు. తాను రెండు రోజుల క్రితం కడియం స్కూల్ తనిఖీ కు వెళ్ళినప్పుడు, మన జిల్లా ప్రధాన కార్యస్థానం అడిగితే కాకినాడ అని చెప్పడం జరిగిందన్నారు. కేవలం పాఠ్య పుస్తకాలలో భోధన సరిపోదని, జెనరల్ నాలెడ్జి కూడా పెంచాల్సిన అవసరం మనపై ఉందన్నారు. విద్యార్థులకు మన జిల్లా స్వరూపం తెలియ చేసేవిధంగా, రాష్ట్ర చిత్రపటం ప్రతి స్కూల్ లో తప్పకుండా ప్రదర్శించాలని జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. జిల్లాలో ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్య వచ్చిన తప్పకుండా అందుబాటులో ఉండి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూభారతదేశం మొదటి వైస్ పెసిడెంట్ గా తదుపరి దేశం రెండవ ప్రెసిడెంట్ గా శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణ భారత దేశానికి సేవలం దించారన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఉపాధ్యాలుగా పనిచేయడం మనకెంతో గర్వకారణమన్నారు. తల్లితండ్రులు తరువాత కంటికి కనిపించే దైవం ఏదయినా వుందంటే అది గురువు అన్నారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాశాల్లో కూడా గురువు స్థానం అతి పవిత్రమైనదన్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబంతో పాటు దేశం ప్రగతికి కృషి చేస్తూ దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. నేడు భారతదేశం ఆర్ధిక వ్యవస్థ ఇంగ్లాండ్ ను క్రాస్ చేసి 5 వ స్థానంలో నిలిచిందన్నారు. నూరుశాతం అక్ష్యరాశ్యత సాధించినట్లయితే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అగ్రగామిగా నిలుస్తుందన్నారు. జిల్లాల పునరవిభజన అనంతరం రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం వచ్చిందని ఎంపీ భరత్ రామ్ పేర్కొన్నారు.
డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య కు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. ఉపాధ్యాయులు అందరూ తమ విధులను అంకిత భావం తో నిర్వహించాలన్నారు.
రూడా చైర్ పర్సన్ ఎం. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ తల్లింతండ్రులు, భగవంతుని తొ పాటు మనం ముందుగా కొలిచేది గురువు నని, అటువంటి గురువుల్లో ప్రధముడైన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. అన్నిటి కన్నా పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యాతనిస్తూ కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను ఆదుణీకరిస్తూ మౌలిక సదుపాయలు కల్పిస్తున్నారన్నారు.
డి ఈవో ఎస్. అబ్రహం మాట్లాడుతూ పాఠశాల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయులు గురుతర భాద్యతతో విద్యార్థులకు చదువు చెప్పడం తో పాటు విచక్షణ నేర్పించడం వలన వారి జీవితాభివృద్ధికి ఏంతో దోహద పడతాయన్నారు. ఈ ఏడాది నుంచి పాఠశాల విద్య పూర్తయినా చోటే ఇంటర్ విద్యను చదువు కొనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. నాడు.. నేడు ద్వారా పాఠశాల ఆదునీకరణ చేస్తూ, మౌలిక సదుపాయలు కల్పించిందన్నారు.
ఈ సందర్బంగా గాంధీ పురం -2 మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు మామా..జగన్ మామా చేస్తున్నా మీకు వందనం..పాటతో అందరినీ అలరించడం తో పాటు పలు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు సాంస్క్రతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
అనంతరం జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ షర్మిలరెడ్డి,డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు, చేతులమీదుగా జిల్లాలోని 19 మండలాల నుండి ఎంపికైన 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, మెమెంటో,శాలువ తో ఘనం గా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాజమహేంద్ర వరం డివిజన్ ఉపవిద్యా శాఖాధికారి తిరుమలదాస్, అర్బన్ రేంజ్ డి ఐ బి దిలీప్ కుమార్,కడియం ఎమ్ ఈ ఓ లజపతి రాయ్, సీతానగరం ఎమ్ ఈ ఓ స్వామి నాయక్,రాజనగరం ఎమ్ ఈ ఓ రామన్న దొర, రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రమణరావు,రాష్ట్ర సహ కార్యదర్శి కోలా సత్యనారాయణ, మంగిన రామారావు, సి ఆర్ పి లు జయంతి శాస్త్రి,జె.శ్రీనివాసరావు, అర్బన్ లో గల అన్ని పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News