Breaking News

సూర్యలంక మృతుల కుటుంబీకులకు అండగా జగనన్న సర్కార్

-మల్లాది విష్ణు చొరవతో ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం
-ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 18 లక్షల విలువైన ఎక్స్ గ్రేషియా చెక్కుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూర్యలంక బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి చనిపోయిన యువకుల కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబీలను పరామర్శించిన సమయంలో జగనన్న సర్కారు అన్ని విధాలా ఆదుకుంటుందని ఇచ్చిన మాటను రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మృతుల కుటుంబాలకు రూ. 18 లక్షల విలువైన చెక్కులను డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రమాదాలు, విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను మానవీయ కోణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మరీముఖ్యంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునేందుకు చనిపోయిన వారి మృతదేహాలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చివరకు రాజకీయ లబ్ధి కోసం రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలను రోడ్డుపైకి తీసుకొచ్చారని నిప్పులు చెరిగారు. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా.. జగనన్న ప్రభుత్వం మానవతా దృక్పథంతో సాయం అందించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రమాద వార్త తెలిసిన దగ్గర నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు యువకుల కుటుంబాలకు బాసటగా నిలిచారని.. భౌతికకాయాలు తీసుకురావడంతో పాటు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. కనుక ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు మానుకుని.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ ప్రమాదాన్ని మానవీయ కోణంలో చూడవలసిన ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నెల రోజుల్లోనే సాయం అందేలా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు చూపిన చొరవ హర్షణీయమన్నారు. అనంతరం తమ కుటుంబాలను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా మృతుల కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని కన్నీటి పర్యంతమవడంతో మల్లాది విష్ణు వారిని ఓదార్చారు. కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ ప్రవీణ్, ఆర్ఐ వరప్రసాద్, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అలంపూర్ విజయ్, అఫ్రోజ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *