Breaking News

అభివృద్ధిలో అగ్రగామిగా తూర్పు నియోజకవర్గం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజానీకం ఏ నమ్మకంతో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించి మద్దతుగా నిలిచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రస్తుతం ప్రభుత్వ పాలన ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ దర్శిపేట వద్ద స్థానిక కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబెర్ చింతల సాంబయ్య ఆధ్వర్యంలో దాదాపు 25 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే వాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్లాంట్ మరియు చిన్న వంతెన దగ్గర సి.సి రోడ్ నకు జరిగిన శంకుస్థాపన లో ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల దర్శిపేట లో ఎలిమెంటరీ స్కూల్ లో నాడు నేడు కింద శంకుస్థాపన చేసిన 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులను అవినాష్ పర్యవేక్షించి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ అధికార పార్టీలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళ కాలంలోనే తూర్పు నియోజకవర్గంలోని 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా విజయవాడ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కి నగర మేయర్ భాగ్యలక్ష్మి అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు.రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటి ఇంటికి వెళ్తుంటే ప్రజలు ఎంతో ఆనందంగా మాకు పథకాలు వస్తున్నాయి అని చెప్తున్నారు.రాష్ట్రంలో అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో,ప్రాంతానికో పరిమితము కాకుండా అభివృద్ధి ఫలాలు అందరికి అందాలనే సంయున్నత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసిన రానున్న 30 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉంటారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 14వ డివిజన్ అధ్యక్షలు శెటికం దుర్గా ప్రసాద్, వైస్సార్సీపీ నాయకులు శివన్నారాయణ, నాసరయ్య, చిన్నయ్య,వెంకటేశ్వర రావు, సిద్దయ్య, సాంబశివరావు, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *