విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గెత్తం విజయకుమార్. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో విజయ్ కుమార్ మాట్లాడుతూ మాల సంక్షేమ సంఘం తరఫున మాల కులస్తులందరికీ విజయవాడలో సంక్షేమ సంఘ భవనం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు.మాల కులస్తులకు, విద్యార్దులకు అన్ని విధాలుగా ఈ భవన నిర్మాణం చేస్తామని తెలిపారు. మాల కులస్తులకు అన్ని విషయాలను వారి సంక్షేమ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన నిష్ణాతులైన యువతకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. గత నెలలో జరిగిన మాల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం పలువురు మంత్రులు మాలకులస్తుల అభివృద్ధికి ఏమి కావాలన్నా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేనమాల నాగు కుమార్, కోశాధికారి సత్తెనపల్లి కిషోర్, జాయింట్ సెక్రెటరీ మధిర ప్రభాకర్, మేడిపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News