Breaking News

పిల్లలు విషయంలో ప్రత్యేక కార్యాచరణ అమలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వ ప్రాథాన్యతా భవనాల నిర్మాణాలను మరింత వేగవంతం చేస్తున్నామని, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు, పౌష్టికాహార లోపం ఉన్న కౌమార బాలికలు, గర్భణీలు, పిల్లలు విషయంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టరు డా. కె. మాధవీలత తెలిపారు. గురువారం విజయవాడ లోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి సుస్థిర అభివృద్ది లక్ష్యాలు, ఆరోగ్యం, పాఠశాలలు, పంచాయితీరాజ్ తదితర శాఖల పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. కె. మాధవీలత ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి పై కలెక్టరు మాధవీలత వివరాలు తెలుపుతూ జిల్లాలో పౌష్టికాహార లోపం ఉన్న 23932 మందిని గుర్తించి వారికి నూరు శాతం పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఇందులో 320 మంది బాలికలు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 4027 మంది ఉండగా వారికి వైఎస్సార్ సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తూ 518 మందికి సంబందించి ప్రత్యేక పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలలోపు 7436 మంది తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించామని 729 మందికి ప్రత్యేక పోషకాహారాన్ని అందించేదుకు చర్యలు తీసుకున్నామన్నారు. బడి బయట పిల్లలకు సంబందించి వివరాలు తెలుపుతూ ప్రాధమిక పాఠశాల పరిధిలో 1075 మంది పిల్లను గుర్తించగా వారిలో తొలిదశలో 235 మందిని తిరిగి పాఠశాలలకు తీసుకొచ్చామన్నారు. ఉన్నత పాఠశాలకు సంబందించి బడిబయట ఉన్న 1253 మందికి గాను తొలివిడతలో 652 మంది స్కూలు వస్తున్నారన్నారు. ప్రభుత్వం పాఠశాలలో బాలికల కోసం 1564 టాయిలెట్స్ నిర్వహణ చేపట్టగా వాటిలో1562 నిర్వాహణ దశలో ఉన్నాయన్నారు. ప్యామిలీ ఫిజిషియన్ కాన్షప్టుక్రింద 4227 మందిని గర్భిణీలకు పరీక్షలు నిర్వహించగా వారిలో హైరిస్కు గల వారిగా 23 మందిని గుర్తించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతుంది. కోవిడ్ కు సంబందించి జిల్లాలో రూ.276 లక్షల పరిహారాన్ని అందించామన్నారు. ఉపాధి హామీ పథకం క్రింద జిల్లాలో సవరించిన 59 లక్షల పనిదినాలకు గాను ఇప్పటి వరకు రూ.42.77 లక్షల (72.49శాతం)పనిదినాలను సాదించామని, సగటు వేతనం రూ. 220.80ను చెల్లించామన్నారు. అమృత సరోవర్ క్రింద జిల్లాలో 75 చెరువుల అభివృద్ది పనులు ప్రారంభించామని ఇప్పటి వరకు 19 పూర్తిచేశామని,మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 390 గ్రామ సచివాలయాలకు గాను 311 భవనాలు పూర్తి చేశామని, 5 చోట్ల స్థల సేకరణ చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాలకు సంబందించి 373 భవనాలకు గాను 273 పూర్తి చేశామని, 61 తుది దశలో ఉండగా 8 చోట్ల స్థలాలను సేకరించాల్సి ఉందన్నారు. జిల్లాలో 337 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వాటిలో 169 పూర్తి చేసామని, మరో 50 పూర్తికానున్నాయనిస14 చోట్ల స్థలాల సేకరణ చేపట్టాల్సిఉందన్నారు.

ప్రభుత్వం ప్రాధాన్యతతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందించే క్రమంలో గ్రామ వార్డు సచివాలయాలుద్వారా అందించే పౌర సేవలకు సంబందించి సగటు 80 సేవలను అందిస్తున్నామని కలెక్టరు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టరు తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్, సీపీవో కె.ప్రకాషరావు, డీపీవో పి. జగదాంబ, డిఎంహెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు, పీడీ ఐసీడిఎస్ కె. విజయలక్ష్మి,ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కె. జ్యోతి కుమారి, డిఈవో ఎస్. అబ్రహం, డీసీహెచ్ ఎస్. డా. యం. సనత్ కుమారి, డిఐవో డా.ఎన్. వసుందర, ఎస్ ఈ పీ ఆర్ ఏబివీ ప్రసాద్,డిఆర్ డిఏ ఎస్. సుభాషిని, డ్వామా పీడీ ఎస్. రామగోపాల్, డిఎల్ డీవోలు, వీణాదేవి, శాంతామణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *