-ఎంపి కేశినేని శ్రీనివాస్(నాని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్ మరియు 34 & 35 డివిజన్ క్లస్టర్ ఇంఛార్జి షేక్ హాబీభ్ పిలుపు మేరకు విజయవాడ 34,35 డివిజన్ నుండి వివిధ పార్టీల యువత మరియు మాజీ మంత్రి స్వర్గీయ ఎమ్ కే బేగ్ అభిమాన కుటుంబ సభ్యులు ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. ఎంపి కేశినేని నాని యువతకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని గారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం రాజకీయ పరిణతి కలిగిన ఓటర్లున్న నియోజకవర్గమని, ఇది టిడిపికి ఓ మోడల్ నియోజకవర్గ మని, ఇక్కడ గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. విజయవాడ పశ్చిమంలో సరైన అభ్యర్ధిని పెడితే వచ్చే ఎన్నికల్లో 25 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి గెలుస్తుందని శ్రీ కేశినేని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం రాజకీయ సంగమం వంటిది,అన్ని డివిజన్ల నుంచీ భవిష్యత్తులో టిడిపి లోకి చేరికలుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్, ఎన్ టి ఆర్ జిల్లా టిడిపి కార్యాలయ కార్యదర్శి సారిపల్లి వెంకట రాధాకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు సుకాసి కిరణ్ కుమార్, 34 వ డివిజన్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షేక్ తస్లిమా భాను, 35 వ డివిజన్ యూనిట్ ఇంఛార్జిలు కొట్టేటి సరితా రాజేశ్వరి, అరవ పెరుమళ్ళు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News